Reshoot
-
‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్ కొరటాల
Koratala Siva Clarifies Acharya Movie Reshoot: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదా అనంతరం ఏప్రిల్ 29న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీషూట్‌పై ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్యలోని కొన్ని సీన్లను కొరటాల రీషూట్ చేశారు’ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ కొరటాల స్పందించారు. చదవండి: నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేసిన హీరో సిద్ధార్థ్ సినిమా రీషూట్ చేస్తే తప్పు ఏముందని, దాన్ని అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారో? అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక సీన్ రీటేక్ చేస్తున్నామంటే అది మరింత బెటర్ అవుట్‌పుట్ కోసమే కదా. ఒక సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా తీయొచ్చని దర్శకుడికి అనిపించినప్పుడు తప్పకుండ రీషూట్‌కు వెళ్లాల్సిందే. అందులో తప్పులేదు. అదే.. అనుకున్న సీన్ బాగా రాకపోయినా అది అలాగే వదిలేస్తే మాత్రం తప్పు అవుతుంది. ఒక సినిమాను రూపొందించేముందు ప్రేక్షకులను వందశాతం సంతృప్తి పరచడమే ధ్యేయంగా పెట్టుకుంటాం. చదవండి: ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్? అదే కారణమా? అందుకే థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని అందించాలంటే రీషూట్‌కు వెళ్లడంలో తప్పులేదు. ఒకవేళ నేను అలా చేయాల్సి వస్తే నిర్మాతలను ఒప్పించి మరి ముందుకు వెళ్తాను’అని ఆయన అన్నారు. ఇక చివరగా ఆచార్య రీషూట్ వార్తలపై స్పందిస్తూ.. అందరు అనుకుంటున్నట్టు ఆచార్య మూవీని రీషూట్ చేయలేదని, ఆ అవసరం కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. -
'సలార్'లో ఆ సీన్ రీషూట్.. స్పెషల్ సాంగ్‌లో 'సాహో' బ్యూటీ ?
Interval Scenes From Salaar Movie May Be Reshoot: దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాకా ప్రభాస్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ చిత్రం 'సలార్'. కేజీఎఫ్‌తో అద్భుతమైన హిట్ సొంత చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న 'సలార్' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ స్క్రీన్‌పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలని తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. అయితే సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను మళ్లీ రీషూట్ చేస్తున్నారట. నిజానికి ఈ సీన్ షూట్ ఇదివరకే పూర్తయిన.. ఔట్పుట్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే ఈ సీన్‌ను రీషూట్ చేయాలని భావిస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందన్న నమ్మకంతో ప్రశాంత్ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. ఇక 'సలార్' స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించనుందని తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధాను ఎంపిక చేశారట మేకర్స్. సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా అలరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ప్రభాస్ మంచి మనసు.. ఏపీ వరద బాధితులకు భారీ విరాళం -
పాతికేళ్ల తరవాత రీ షూట్ అయిన పాట
చిత్రం: లిటిల్ సోల్జర్స్ రచన: సిరివెన్నెల సంగీతం: శ్రీ గానం: దీపిక, విష్ణుకాంత్ నా జీవితంలో ‘లిటిల్ సోల్జర్స్’ ఒక మైల్స్టోన్. ఆ సినిమా సమయానికి నాకు పదేళ్లు. నా చెల్లిగా వేసిన కావ్యకు నాలుగేళ్లు. కావ్య మరీ చిన్నపిల్ల కావటం వల్ల 40 రోజులు అనుకున్న షూటింగ్ వందరోజుల పాటు జరిగింది. దర్శకులు గుణ్ణం గంగరాజుగారు ఆయనకు కావలసిన విధంగా వచ్చేవరకు ఎన్ని టేక్‌లైనా ఓపికగా చేయించారు. ఈ సినిమాకు పిల్లలే హీరోలు. ఈ సినిమాలోని ‘అయామ్ వెరీ గుడ్ గర్ల్’ పాట నేటికీ చిగురాకులా పచ్చగా ఉంది. పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పాటను, ఇప్పుడు మా అమ్మాయికి అన్నం తినిపించటానికి చూపిస్తున్నాను. ఈ పాతికే ళ్లలో ఎంతోమంది వచ్చి, ‘నాకు మీలాంటి అన్నయ్య ఉన్నాడు, నాకు బన్నీలాంటి చెల్లాయి ఉంది’ అంటూ చెబుతూనే ఉన్నారు. ఈ సినిమా తరవాత నేను కావ్యను మళ్లీ చూడలేదు. కాని అప్పుడే బన్నీ నాకు చెల్లి అని ఫిక్స్ అయిపోయాను. బన్నీ (కావ్య) పెళ్లికి వాళ్ల అన్నయ్య ఫోన్ చేసి, ‘మన చెల్లికి పెళ్లి జరుగుతోంది, నువ్వు రావాలి’ అని పిలిచాక, ఈ పాట రీషూట్ చేయబోతున్న విషయం చెప్పాడు. ఇందులో నేను స్నేహితుడిగాను, ఆదర్శ్ అన్నయ్యగాను చేద్దామన్నాడు. అలా ఆ పాటను 2015లో రీషూట్ చేశాం. ఇలా ఈ పాటతో పాతికేళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఆ సినిమా షూటింగ్ అంతా మాకు సెలబ్రేషనే. గుణ్ణం గంగరాజుగారి వదిన ఊర్మిళ గారి అమ్మాయి కావ్య. అయినా ‘ఇద్దరూ మన పిల్లలే’ అనే భావనతోనే చూశారు. కావ్య షూటింగ్లో ఎవ్వరి మాటా వినేది కాదు. ఊర్మిళ పెద్దమ్మ లేదంటే నేను మా ఇద్దరి మాటే వినేది. కెమెరా పక్కనే నిలబడి ఫైవ్‌స్టార్, కోక్ చూపిస్తే చాలు వెంటనే చేసేసేది. ఆ పాటలోని ప్రతి చిన్న బిట్‌ను చాలా టేక్‌లు తీశారు. ‘టింగ్’ అనే చిన్న బిట్ కోసం కనీసం పాతికసార్లు చేశాం. నాలుగేళ్ల కావ్య చేత చేయించిన ఘనత గంగరాజు, రసూల్ గార్లదే. ఒక్కోసారి నిద్రపోతుండేవాళ్లం. ఒకసారి బ్రేక్ చెప్పకుండా, ఎవ్వరికీ చెప్పకుండా అన్నం తినేశాను. అప్పుడు గంగరాజు గారు కేకలేసి, క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ఈ సినిమాలో మాకు తల్లిదండ్రులుగా నటించిన అరవింద్, హీరా గార్లు మాకు చాకొలేట్లే కాకుండా బహుమతులు కూడా తెచ్చిపెట్టారు. ఈ పాటను ఎప్పటికీ మరచిపోలేను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
వర్మ ప్రేయసి
తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ‘తూచ్.. అవుట్‌పుట్ నచ్చలేదు’ అంటూ నిర్మాతలు మళ్లీ తీయడానికి రెడీ అయిపోయారు. ధృవ్‌నే హీరోగా ఈ సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్ ఇతర తారాగణం స్థానంలో కొత్తవారు ఉంటారు. ఈ కొత్త వెర్షన్‌కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాత వెర్షన్లో హీరోయిన్గా నటించిన మేఘా చౌదరి స్థానంలో బన్నితా సాంధును ఎంపిక చేశారు టీమ్. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. ఇంతకుముందు వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘అక్టోబర్’లో హీరోయిన్గా నటించారు బన్నిత. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘అక్టోబర్’ చిత్రంలో నటించడానికి ముందు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారామె. 2016లో గాయకుడు కిశోర్ కుమార్ ‘ఏక్ అజ్నబీ హసీనా’ అనే పాటను రీ–క్రియేట్ చేసిన మ్యూజిక్ వీడియోతో ఫేమస్ అయ్యారు బన్నిత. -
‘వర్మ’కేమైంది!
తమిళసినిమా: వర్మకేమైంది? కోలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారిన షాకింగ్ న్యూస్. దర్శకుడు బాలా సృష్టి వర్మ. దీన్ని ఆయన సృష్టి అనవచ్చో కాదో. ఎందుకంటే వర్మ బాలా ముద్దుబిడ్డ కాదు. అద్దె బిడ్డ అనవచ్చు. ఆయన రాసుకున్న కథా చిత్రం కాదు. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ వర్మ. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఇది. ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థకు ఫస్ట్ కాపీ విధానంలో బాలా నిర్మాణ సంస్థ బీ స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రం వర్మ. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా ఈ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు వర్మ చిత్రాన్ని విడుదల చేయడం లేదని వెల్లడిస్తూ మీడియాకు ఇక ప్రకటనను విడుదల చేశారు. అర్జున్‌రెడ్డికి రీమేక్‌లా లేదు అందులో వారు పేర్కొంటూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రాన్ని వర్మ పేరుతో రీమేక్ చేసి ఫస్ట్‌కాపీ బేస్డ్లో బాలా బి.స్టూడియోస్ సంస్థ తమకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే బాలా తెరకెక్కించిన వర్మ చిత్రం ఫస్ట్‌కాపీ చూసిన తరువాత తమకు సంతృప్తి అనిపించలేదన్నారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒరిజినల్ చిత్రానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. దీంతో వర్మ చిత్రాన్ని విడుదల చేయరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని మళ్లీ వేరే దర్శకుడితో రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. హీరోగా ధృవే నటిస్తారని, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. జూన్ 29న విడుదల చేస్తామని ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా పూర్తిగా అదీ ఒక జాతీయ అవార్డు గ్రహీత, పలు వైవిధ్యభరిత చిత్రాల సృష్టికర్త తెరకెక్కించిన చిత్రాన్ని విడుదల సంతృప్తిగా లేదని పక్కన పడేయనున్నట్లు చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నా చిత్రం రిలీజ్ కావడం లేదా? వర్మ చిత్రంలో ధృవ్‌కు జంటగా నవ నటి మేఘాచౌదరి నటించింది. మోడలింగ్ రంగంలో పాపులర్ అయిన ఈ బెంగాలీ బ్యూటీ హీరోయిన్గా ఇదే తొలి చిత్రం. వర్మ చిత్రం విడుదల కావడం లేదు తెలుసా అన్న ప్రశ్నకు మేఘాచౌదరి షాక్ అయ్యింది. కొత్తగా రూపొందించనున్న చిత్రంలో ధృవ్ నటించనున్నాడు. మరి ఈ చిన్నది ఉంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. విక్రమ్ కూడానా? వర్మ చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించడంతో ఆ చిత్ర దర్శకుడు బాలా చాలా హర్ట్ అయ్యారు. ఈయనకు దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్ ఉంది. ఆయన చిత్రాలకు ఆయనే కథలను రాసుకుంటారు. అలాంటి దర్శకుడు అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు ముందు వ్యతిరేకించారట. అయితే సేతు చిత్రంతో తనకు సినీ జీవితాన్ని చ్చిన నటుడు విక్రమ్ తన కొడుకును హీరోగా పరిచయం చేయమని కోరడంతో ఆయన కోసమే అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు బాలా సమ్మతించినట్లు సమాచారం. అయినా రీమేక్‌ను అలానే కాపీ కొట్టి చేయనని బాలా ముందే చెప్పారట. తీరా వర్మ చిత్రం పూర్తయిన తరువాత నటుడు విక్రమ్ కూడా నిర్మాతల తరఫున మాట్లాడటం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రీషూట్‌లో ‘పడి పడి లేచే మనసు’!
శర్వానంద్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సంతృప్తిగా లేని చిత్రయూనిట్ రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రీషూట్‌కు డేట్స్ కేటాయించేందుకు సాయి పల్లవి అదనపు పారితోషికం అడుగుతున్నారట. నిర్మాతలు కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేందుకు అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. -
రీ-షూట్ కోసం ఐదు కోట్ల ఖర్చు...!
టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకటి బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కాగా, మరొకటి వీరనారి రాణీ లక్ష్మీ భాయ్ జీవితగాథ మణికర్ణిక. కంగనా రనౌత్ లీడ్ రోల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక ప్రస్తుతం రీషూట్ జరుపుకుంటోంది. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్లో రీలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్. రీషూట్ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రీ షూట్ జరుపుకుంటుండగా, ఈ కారణంగా బడ్జెట్ మరో ఐదు కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, మణికర్ణికకు సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చిన విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరిపి మణికర్ణికను ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది కూడా. -
విజయ్’పులి’రీషూట్ జరుగుతుందా..?
-
కమల్ చిత్ర క్లైమాక్స్ రీ షూట్?
ప్రముఖ నటుడు కమలహాసన్ తన చిత్ర క్లైమాక్స్‌ను రీ షూట్ చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఆయన ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నారు. ఏ చిత్ర క్లైమాక్స్ రీషూట్ అనే సందేహం కలగవచ్చు. కమ ల్ నటిస్తున్న ఉత్తమ విలన్, పాపనాశం, విశ్వరూపం-2 చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమ విలన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం తొలుత తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బహుశా ఫిబ్రవరి చివరిలో విడుదల కావచ్చు. అదే విధంగా పాపనాశం చిత్రం షూటింగ్ పూర్తరుు్యంది. ఉత్తమ విలన్ తరువాత విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ఇదే. ఇక మూడో చిత్రం విశ్వరూపం-2. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ ఇది. విశ్వరూపం చిత్రం ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం కంటే విశ్వరూపం-2లో రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలు రెట్టింపుగా ఉంటాయని కమలహాసన్ ఇప్పటికే వెల్లడించారు. విశ్వరూపం చిత్రంలో నటించిన నాయికలు పూజా కుమార్, ఆండ్రియలే ఈ చిత్రం లోనూ నటిస్తున్నారు. విశ్వరూపం-2 చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో కొన్ని కమల్‌ను సంతృప్తి పరచలేదని సమాచారం. దీంతో వాటిని మళ్లీ చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. నటీనటులు, సాంకేతిక వర్గం సెట్ అవడానికి కొద్ది రోజులు పడుతుంది కాబట్టి మరో రెండు వారాల్లో చిత్ర క్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలను కమల్ రీ షూట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా ఉత్తమ విలన్, పాపనాశం చిత్రా లు ఈ ఏడాదిలో తెరపైకి రానున్న విశ్వరూపం-2 చిత్రం మాత్రం వచ్చే ఏడాదే విడుదల అయ్యే అవకాశం ఉంటుందని కోడంబాక్కం వర్గాల మాట. అందుకు ఆస్కార్ రవిచందర్ కూడా ఒక కారణం అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి నిర్మాత ఆయనే. ప్రస్తుతం శంకర్, విక్రమ్‌ల ఐ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీంతో విశ్వరూపం-2 చిత్ర విడుదలకు కాస్త సమయం తీసుకుంటారని టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.