Chiranjeevi: Koratala Siva Response On Acharya Movie Reshoot Rumours, Goes Viral - Sakshi
Sakshi News home page

Koratala siva-Acharya: ఆచార్య రీషూట్‌పై స్పందించిన కొరటాల శివ

Published Tue, Apr 19 2022 3:26 PM | Last Updated on Tue, Apr 19 2022 3:49 PM

Koratala Siva Response On Acharya Movie Reshoot Rumours - Sakshi

Koratala Siva Clarifies Acharya Movie Reshoot: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదా అనంతరం ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీషూట్‌పై ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆచార్యలోని కొన్ని సీన్లను కొరటాల రీషూట్‌ చేశారు’ అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్‌ కొరటాల స్పందించారు.

చదవండి: నెక్ట్స్‌ మూవీ అనౌన్స్‌ చేసిన హీరో సిద్ధార్థ్‌

సినిమా రీషూట్‌ చేస్తే తప్పు ఏముందని, దాన్ని అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారో? అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక సీన్‌ రీటేక్‌ చేస్తున్నామంటే అది మరింత బెటర్‌ అవుట్‌పుట్‌ కోసమే కదా. ఒక సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా తీయొచ్చని దర్శకుడికి అనిపించినప్పుడు తప్పకుండ రీషూట్‌కు వెళ్లాల్సిందే. అందులో తప్పులేదు. అదే.. అనుకున్న సీన్‌ బాగా రాకపోయినా అది అలాగే వదిలేస్తే మాత్రం తప్పు అవుతుంది. ఒక సినిమాను రూపొందించేముందు ప్రేక్షకులను వందశాతం  సంతృప్తి పరచడమే ధ్యేయంగా పెట్టుకుంటాం.

చదవండి: ఆచార్య నుంచి కాజల్‌ సీన్స్‌ డిలీట్‌? అదే కారణమా?

అందుకే థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని అందించాలంటే రీషూట్‌కు వెళ్లడంలో తప్పులేదు. ఒకవేళ నేను అలా చేయాల్సి వస్తే నిర్మాతలను ఒప్పించి మరి ముందుకు వెళ్తాను’అని ఆయన అన్నారు. ఇక చివరగా ఆచార్య రీషూట్‌ వార్తలపై స్పందిస్తూ.. అందరు అనుకుంటున్నట్టు ఆచార్య మూవీని రీషూట్‌ చేయలేదని, ఆ అవసరం కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement