కమల్ చిత్ర క్లైమాక్స్ రీ షూట్? | Kamal Haasan To Reshoot Vishwaroopam 2! | Sakshi
Sakshi News home page

కమల్ చిత్ర క్లైమాక్స్ రీ షూట్?

Published Sun, Jan 11 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

కమల్ చిత్ర క్లైమాక్స్ రీ షూట్?

కమల్ చిత్ర క్లైమాక్స్ రీ షూట్?

 ప్రముఖ నటుడు కమలహాసన్ తన చిత్ర క్లైమాక్స్‌ను రీ షూట్ చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఆయన ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నారు. ఏ చిత్ర క్లైమాక్స్ రీషూట్ అనే సందేహం కలగవచ్చు. కమ ల్ నటిస్తున్న ఉత్తమ విలన్, పాపనాశం, విశ్వరూపం-2 చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమ విలన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం తొలుత తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బహుశా ఫిబ్రవరి చివరిలో విడుదల కావచ్చు. అదే విధంగా పాపనాశం చిత్రం షూటింగ్ పూర్తరుు్యంది.
 
 ఉత్తమ విలన్ తరువాత విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ఇదే. ఇక మూడో చిత్రం విశ్వరూపం-2. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ ఇది. విశ్వరూపం చిత్రం ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం కంటే విశ్వరూపం-2లో రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలు రెట్టింపుగా ఉంటాయని కమలహాసన్ ఇప్పటికే వెల్లడించారు. విశ్వరూపం చిత్రంలో నటించిన నాయికలు పూజా కుమార్, ఆండ్రియలే ఈ చిత్రం లోనూ నటిస్తున్నారు. విశ్వరూపం-2 చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో కొన్ని కమల్‌ను సంతృప్తి పరచలేదని సమాచారం.
 
 దీంతో వాటిని మళ్లీ చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. నటీనటులు, సాంకేతిక వర్గం సెట్ అవడానికి కొద్ది రోజులు పడుతుంది కాబట్టి మరో రెండు వారాల్లో చిత్ర క్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలను కమల్ రీ షూట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా ఉత్తమ విలన్, పాపనాశం చిత్రా లు ఈ ఏడాదిలో తెరపైకి రానున్న విశ్వరూపం-2 చిత్రం మాత్రం వచ్చే ఏడాదే విడుదల అయ్యే అవకాశం ఉంటుందని కోడంబాక్కం వర్గాల మాట. అందుకు ఆస్కార్ రవిచందర్ కూడా ఒక కారణం అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి నిర్మాత ఆయనే. ప్రస్తుతం శంకర్, విక్రమ్‌ల ఐ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీంతో విశ్వరూపం-2 చిత్ర విడుదలకు కాస్త సమయం తీసుకుంటారని టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement