వర్మ ప్రేయసి | Banita Sandhu To Star In Arjun Reddy Tamil Remake | Sakshi
Sakshi News home page

వర్మ ప్రేయసి

Published Sun, Feb 17 2019 2:25 AM | Last Updated on Sun, Feb 17 2019 2:25 AM

Banita Sandhu To Star In Arjun Reddy Tamil Remake - Sakshi

బన్నితా సాంధు

తెలుగు హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘వర్మ’తో హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ‘తూచ్‌.. అవుట్‌పుట్‌ నచ్చలేదు’ అంటూ నిర్మాతలు మళ్లీ తీయడానికి రెడీ అయిపోయారు. ధృవ్‌నే హీరోగా ఈ సినిమా మొత్తాన్ని రీ–షూట్‌ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్‌ ఇతర తారాగణం స్థానంలో కొత్తవారు ఉంటారు.

ఈ కొత్త వెర్షన్‌కు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాత వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించిన మేఘా చౌదరి స్థానంలో బన్నితా సాంధును ఎంపిక చేశారు టీమ్‌. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. ఇంతకుముందు వరుణ్‌ ధావన్‌ హీరోగా వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘అక్టోబర్‌’లో హీరోయిన్‌గా నటించారు బన్నిత. ఇప్పుడు కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ‘అక్టోబర్‌’ చిత్రంలో నటించడానికి ముందు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారామె. 2016లో గాయకుడు కిశోర్‌ కుమార్‌ ‘ఏక్‌ అజ్‌నబీ హసీనా’ అనే పాటను రీ–క్రియేట్‌ చేసిన మ్యూజిక్‌ వీడియోతో ఫేమస్‌ అయ్యారు బన్నిత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement