
ధృవ్,మేఘా చౌదరి
తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ‘వర్మ’లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించారు. ఇందులో బెంగాలీ మోడల్ మేఘా చౌదరి కథానాయికగా నటించారు. ఈశ్వరీరావ్, రైజా విల్సన్, ఆకాశ్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి రధన్ స్వరకర్త. ఆదివారం ధృవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌లను విడుదల చేశారు.
అలాగే ‘వర్మ’ తెలుగు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టీమ్. సో... ‘వర్మ’ చిత్రం తెలుగులో కూడా ఏమైనా డబ్ అవుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే హిందీ ‘అర్జున్‌రెడ్డి’లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్‌ని తెరకెక్కించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ రీమేక్‌కి దర్శకుడు. ఈ చిత్రానికి ముందుగా తారా సుతారియాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ కుదరక వీలు పడలేదట. ఇప్పుడీ పాత్రను కియారా అద్వానీ చేయబోతున్నారని బాలీవుడ్ లేటెస్ట్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment