కేరళ సీఎంకు చెక్కు అందజేస్తున్న నటుడు ధృవ్, ముఖేష్ ఆర్.మెహతా
పెరంబూరు: నవ నటుడు ధృవ్ తన తొలి పారితోషికాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం అందించారు. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్ అమెరికాలో నటనలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ్ తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. తండ్రి విక్రమ్‌కు సేతు చిత్రం ద్వారా నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు బాలానే ధృవ్ తొలి చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇటీవల వరద బీభత్సంతో కేరళ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆర్థికంగా, ఇతరత్రా సాయం చేశారు. తాజాగా ధృవ్ వర్మ చిత్ర హీరోగా అందుకున్న పారితోషికాన్ని వరద బాధితుల సహాయార్థం అందజేసి దాతృత్వం చాటుకున్నాడు. ఆయన కేరళ సీఎం పినరాయి విజయన్‌ను సోమవారం కలిసి తన తొలి చిత్ర పారితోషికాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయనతో పాటు వర్మ చిత్ర నిర్మాత ముఖేశ్ ఆర్.మెహతా, ఏవీ.అనూప్ ఉన్నారు. ఇప్పటికే ధృవ్ తండ్రి, నటుడు విక్రమ్ కేరళ వరద బాధితులకు సహాయంగా రూ.35లక్షలను అందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment