Vijay Deverakonda to play a role in Prabhas's Salaar Film Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Salaar Movie: సలార్‌లో విజయ్‌ దేవరకొండ.. అందులో నిజమెంత?

Published Mon, Nov 28 2022 4:36 PM | Last Updated on Mon, Nov 28 2022 4:44 PM

Vijay Deverakonda to play a role in Prabhas Film  Salaar photo goes viral  - Sakshi

లైగర్‌ ఫ్లాప్‌ తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మరో సినిమా కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. కొత్త సినిమా అప్‌డేట్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్న సలార్‌ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నారని టాక్. ఈ సినిమాలో ‍ప్రభాస్‌కు సోదరుడిగా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సాలార్ సెట్స్‌లో ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.  విజయ్‌ కొద్ది రోజుల నుంచి ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని స్టూడియోలో జరుగుతోన్న ఈ షూట్‌ నుంచి ఓ ఫొటో బయటకు రాగా.. అందులో ఆయన లుక్‌ చూస్తే  సలార్‌లోని ప్రభాస్‌ని గుర్తు చేసేలా ఉంది. ఈ ఫొటో చూసిన అభిమానులు సలార్‌లో నటిస్తున్నారని భావిస్తున్నారు. 

(చదవండి: ‘సలార్‌’ విలన్‌ని చూస్తే గూస్‌ బంప్సే..)

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్‌’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, పృథ్వీరాజ్‌ కీ రోల్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement