నాన్నతో కలిసి నటించను | Tiger Shroff reveals why he does not want to do a film with dad Jackie Shroff | Sakshi
Sakshi News home page

నాన్నతో కలిసి నటించను

Published Fri, May 3 2019 3:06 AM | Last Updated on Fri, May 3 2019 3:06 AM

Tiger Shroff reveals why he does not want to do a film with dad Jackie Shroff - Sakshi

టైగర్‌ ష్రాఫ్‌

... అంటున్నారు బాలీవుడ్‌ యంగ్‌ హీరో, జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌. ఎవ్వరైనా తమ తల్లిదండ్రులతో యాక్ట్‌ చేయడానికి  ఆసక్తి చూపిస్తారు. కానీ టైగర్‌ మాత్రం భయపడుతున్నాడు. ఆ భయానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘‘నాన్న, నేను కలసి నటించాలంటూ చాలా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ సరైన స్క్రిప్ట్‌ రావాలి. అలాగే ప్రస్తుతానికి నాన్నగారితో నటించలేను. నాన్న, నేను ఒకే ఫ్రేమ్‌లో ఉంటే కచ్చితంగా నేను ఫ్రీజ్‌ అయిపోతాను. అందుకే ఇప్పట్లో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసు కోను’’ అన్నాడు. మరి మీ సినిమాలను గురించి నాన్నతో డిస్కస్‌ చేస్తారా? అని అడగ్గా – ‘‘నేను ఏ సినిమా చేస్తున్నాను, స్క్రిప్ట్‌ విషయాలు ఎప్పుడూ నాన్నతో డిస్కస్‌ చేయను. సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే నాన్నకు చూపిస్తాను. చూశాక, ‘బిందాస్‌. చాలా బావుంది. పాస్‌ అయ్యావు’ అని మాత్రం చెబుతారు. నాన్నే నా పెద్ద విమర్శకుడు అని భావిస్తాను’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement