Priyamani 'Quotation Gang' Trailer is Out - Sakshi
Sakshi News home page

Quotation Gang: కొటేషన్‌ గ్యాంగ్‌ రెడీ.. టీజర్‌ రిలీజ్‌

Published Tue, Jan 17 2023 10:35 AM | Last Updated on Tue, Jan 17 2023 11:39 AM

Priyamani Quotation Gang Trailer Out - Sakshi

నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కొటేషన్‌ గ్యాంగ్‌. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ జాకీష్రాఫ్, సన్నీలియోన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిల్మినెటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గాయత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నాడు. ఈయన దర్శకుడు బాల శిష్యుడు. డ్రమ్స్‌ శివమణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌ కథే ఈ సినిమా. చెన్నై, ముంబై, కశ్మీర్‌ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో కథ సాగుతుంది. అయితే ఈ మూడింటికి  ఒక లింకు ఉంటుంది. మొదట చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని భావించాం. అయితే షూటింగ్‌ పూర్తి చేసి ఎడిటింగ్‌ చేసిన తర్వాత విజువల్స్, మేకింగ్‌ ఆఫ్‌ కంటెంట్‌ చూశాక ఇది థియేటర్లో విడుదల చేయాల్సిన చిత్రమని భావించాం. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. ఏప్రిల్‌లో కొటేషన్‌ గ్యాంగ్‌ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. చిత్ర టీజర్‌ చూడగానే తాను ఆశ్చర్యపోయి దీనికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు డ్రమ్స్‌ శివమణి చెప్పారు.  

చదవండి: రివాల్వర్‌ రీటాగా కీర్తి సురేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement