sunnyleone
-
పిల్లల సమక్షంలో సన్నీ లియోన్ మళ్లీ పెళ్లి.. ఎందుకంటే? (ఫొటోలు)
-
సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు..
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని హట్ట కంగ్జీబాంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే ఆదివారం నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు ప్రముఖ నటి సన్నీలియోన్ హాజరవుతున్నారు. ఈ వేదికకు 100 మీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ పేలుడు ఐఈడీ వల్ల జరిగిందా? లేదా గ్రెనేడ్‌తో దాడి చేశారా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు. చదవండి: రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు -
ప్రియమణి 'కొటేషన్ గ్యాంగ్' టీజర్ చూశారా?
నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కొటేషన్ గ్యాంగ్. ఇందులో బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, సన్నీలియోన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిల్మినెటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈయన దర్శకుడు బాల శిష్యుడు. డ్రమ్స్ శివమణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. 'కిరాయి హత్యలు చేసే గ్యాంగ్ కథే ఈ సినిమా. చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో కథ సాగుతుంది. అయితే ఈ మూడింటికి ఒక లింకు ఉంటుంది. మొదట చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని భావించాం. అయితే షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత విజువల్స్, మేకింగ్ ఆఫ్ కంటెంట్ చూశాక ఇది థియేటర్లో విడుదల చేయాల్సిన చిత్రమని భావించాం. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. ఏప్రిల్‌లో కొటేషన్ గ్యాంగ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. చిత్ర టీజర్ చూడగానే తాను ఆశ్చర్యపోయి దీనికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు డ్రమ్స్ శివమణి చెప్పారు. చదవండి: రివాల్వర్ రీటాగా కీర్తి సురేశ్ -
వీరమహాదేవి విజృంభణ
రణభూమిలో శత్రువులపై యుద్ధం చేయడానికి సైన్యంతో సిద్ధమయ్యారు రాణీ వీరమహాదేవి. ఈ వీరనారి యుద్ధభూమిలో ఏ స్థాయిలో విజృంభించారో వెండితెరపై చూడాల్సిందే. సన్నీ లియోన్ టైటిల్ రోల్లో స్టివ్ కార్నర్ పతాకంపై వీసీ వడివుడయాన్ దర్శకత్వంలో ఫోన్స్ స్టీవెన్ నిర్మిస్తున్న చిత్రం ‘వీరమహాదేవి’. వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఐదు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘తెలుగులో తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు సన్నీ లియోన్. అందుకోసమే తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేయబోతున్నాం. ప్రస్తుతం కేరళ అడవుల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. గ్రాఫిక్స్ కోసం కెనడాలోని ఓ కంపెనీ వర్క్ చేస్తోంది. ఓన్లీ గ్రాఫిక్స్‌కి మాత్రమే దాదాపు 40 కోట్లు కేటాయించాం. ఈ చిత్రం కోసం సన్నీ లియోన్ 150 రోజులు డేట్స్ ఇచ్చారు’’అని పేర్కొంది చిత్రబృందం. -
సన్నీ లియోన్ ‘వీర’ లుక్ చూశారా?
సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘వీర మహాదేవి’ షూటింగ్ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమైనాయి. మూవీలో పవర్ ఫుల్ క్వీన్ పాత్ర పోషించన్ను బాలీవుడ్ నటిసన్నీలియోన్ ఫిబ్రవరి 7న వీర మహాదేవి షూటింగ్ మొదలైందంటూ సోషల్‌మీడియాలో ప్రకటించారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఇటుకలను ఒంటిచేత్తో ఒక్క దెబ్బకు పడగొడుతున్న ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నేను కొడితే మొత్తం అన్ని ఇటుకులు దెబ్బకు నుజ్జునుజ్జు కావాల్సిందే.. అంటూ ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా సౌత్ లో, అందులోనూ తెలుగులో పూర్తి స్థాయిలో నటిస్తుండటంతో నిర్మాతలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అంతేకాదు యుద్ధ సన్నివేశాలకోసం కత్తిసాము, గుర్రపు స్వారీ, తదితర విద్యల్లో స్పెషల్ ట్రెయినింగ్ కూడా తీసుకుంటోందట. తమిళంలో వీరమాదేవి అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం తెలుగులో వీరమహాదేవి అనే టైటిల్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా వి.సి.వడివుడయన్ దర్శకుడు. నవదీప్, నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. #Veeramadevi shooting started today!! So excited 😊@steevescorner @vcvadivudaiyan @DoneChannel1#SunnyLeone pic.twitter.com/Yn8HNjjci9 — Sunny Leone (@SunnyLeone) February 7, 2018 I swear all the bricks crumbled to the ground after I hit them!!#SunnyLeone #DhaiKiloKaHath💪 pic.twitter.com/7NDBIpCbRT — Sunny Leone (@SunnyLeone) February 8, 2018 -
పవన్ అభిమానులకు వర్మ సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్..! తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు విడిచారు. మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ జన సమూహం అవుతున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని వివాదస్పద పోస్ట్ చేశారు. ఇక పవన్ రాజకీయ పార్టీ జనసేనపై.. పవన్, సన్నీలియోన్ తో కలిసి రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తే అసాధారణ రాజకీయ శక్తిగా మారుతారని తన ప్రగాఢ నమ్మకమని, ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరు వేరు వినోదాత్మక సుఖాలు ఇచ్చారని వర్మ పేర్కొన్నాడు. ఇక చివరిగా సన్నీలియోన్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య ఒకరిని కౌగిలించుకునే అవకాశం వస్తే ఎవరిని కౌగిలించుకుంటారన్నది పవన్ అభిమానిగా పవన్ లక్షల అభిమానులకు నా ప్రశ్న. అని అభిమానులను ఆగ్రహానికి గురిచేసే పోస్టు పెట్టారు. ఈ వరుస పోస్టులపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలోమండిపడుతున్నారు. ఎప్పుడు సన్నీలియోన్, శ్రీదేవి తప్ప వర్మకు వేరే ధ్యాస లేదంటూ విమర్శిస్తున్నారు. -
గుర్తుపట్టలేనంతగ సన్నీలియోన్
ఫోటోలో ఉన్న బాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా. అస్సలు గుర్తుపట్టలేక పోతున్నారు కదా. అయితే మీకో క్లూ. ఇటీవల కేరళలో ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.. అదేనండీ పొర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్లో నటిగా స్థిరపడ్డ సన్నీ లియోన్. సన్నీకి యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. తన తదుపరి ప్రాజెక్టులో నటిస్తున్న పాత్రకు అనుగుణంగా ప్రొస్తేటిక్స్ వేసుకుని తీసిన ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు మీరు చూడని విధంగా నా తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నా.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే మేకప్ వేసుకోవడానికి ముందు ఓ కాటన్‌తో పూర్తిగా చుట్టి అసలు ఏమాత్రం మొహం కనిపించకుండా ఉన్న మరో ఫోటోను కూడా సన్నీ పోస్ట్ చేసింది. మెడిటేషన్ చేస్తున్నట్టుగా కూర్చొని ఉన్న ఆ ఫోటోకు.. నన్ను నేను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నా అంటూ ఓ కామెంట్ పెట్టింది. అయితే మేకప్ పూర్తిగా వేయకముందు తీసిన ఫోటోలు కావడంతో తర్వాతి సినిమాలో ఎలాంటి పాత్రలో సన్నీ నటిస్తోందో అని ఆమె అభిమానులు చర్చిస్తున్నారు. పూర్తిగా మేకప్ వేసుకుంటే సన్నీ ఎలా ఉంటుందో చూడాలని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
హైదరాబాద్‌లో హల్చల్ చేసిన సన్నీలియోన్
-
నోట్ బుక్‌పై శిల్పాశెట్టి ఫోటో
పూణే: పూణేలోని ఓ ప్రముఖ స్కూల్లో ఓ విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఆ స్కూల్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలపై శిల్పాశెట్టి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ని ఈ అంశంపై కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే.. పిల్లలు టీవీల్లోనే ఆమెను చూస్తున్నారు కదా?.. పుస్తకంమీద చూస్తే తప్పేంటి అని సమాధానమిచ్చారు.. ఈ సంఘటన ప్రముఖ నటి ,నిర్మాత, దర్శకురాలు రేణుదేశాయ్‌కి తన మేనల్లుడు విషయంలో ఎదురైన అనుభవం. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరికొందరి పుస్తకాలపై సన్నీలియోన్, బిపాసాబసుల ఫొటోలు కూడా ఉన్నాయట. విద్యార్థుల పుస్తకాలపై ఇలాంటి ఫొటోలు ముద్రించడం చూస్తే విద్యకన్నా..వినోదానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. This is a notebook given frm a reputed school of my nephew for 9th std! &we r wondering why this generation is weird😣 pic.twitter.com/ICtzHqn4FO — R (@renuudesai) June 7, 2015 @trulymaheshh some more with Bipasha Basu &Sunny Leone too!!!when questioned d principal replied that kids are watching them already on tv!! — R (@renuudesai) June 7, 2015