
సాక్షి, హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్..! తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు విడిచారు.
మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ జన సమూహం అవుతున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని వివాదస్పద పోస్ట్ చేశారు. ఇక పవన్ రాజకీయ పార్టీ జనసేనపై.. పవన్, సన్నీలియోన్ తో కలిసి రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తే అసాధారణ రాజకీయ శక్తిగా మారుతారని తన ప్రగాఢ నమ్మకమని, ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరు వేరు వినోదాత్మక సుఖాలు ఇచ్చారని వర్మ పేర్కొన్నాడు.
ఇక చివరిగా సన్నీలియోన్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య ఒకరిని కౌగిలించుకునే అవకాశం వస్తే ఎవరిని కౌగిలించుకుంటారన్నది పవన్ అభిమానిగా పవన్ లక్షల అభిమానులకు నా ప్రశ్న. అని అభిమానులను ఆగ్రహానికి గురిచేసే పోస్టు పెట్టారు. ఈ వరుస పోస్టులపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలోమండిపడుతున్నారు. ఎప్పుడు సన్నీలియోన్, శ్రీదేవి తప్ప వర్మకు వేరే ధ్యాస లేదంటూ విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment