

ఒకప్పటి శృంగార తార, ప్రస్తుతం నటి సన్నీ లియోన్ మళ్లీ పెళ్లిచేసుకుంది.

వేరే ఎవరినో కాదండోయ్.. తన భర్తనే మళ్లీ పెళ్లాడింది.

భారత మూలాలున్న సన్నీ లియోన్.. 2011లో డేనియల్ వెబర్‌తో ఒక్కటైంది.

తొలుత ఈ జంట నిషా అనే అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

తర్వాత వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీ.

కాకపోతే పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈసారి పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే కోరిక సన్నీ లియోన్‌కి కలిగింది.

మాల్దీవులకు వెళ్లి, మళ్లీ పెళ్లి ఆలోచనని సన్నీ లియోన్ నిజం చేసుకుంది.






