marriage photos
-
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి వేడుకలు.. సందడి చేసిన యాంకర్ సుమ కనకాల!
-
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
పిల్లల సమక్షంలో సన్నీ లియోన్ మళ్లీ పెళ్లి.. ఎందుకంటే? (ఫొటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా స్టార్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్ హుడా షేర్ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్ కూడా జతచేశాడు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు. తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.శుభాకాంక్షల వెల్లువఈ నేపథ్యంలో కొత్త జంటకు క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, ఖలీల్ అహ్మద్ తదితర భారత క్రికెటర్లతో పాటు మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్), లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. దీపక్ హుడా దంపతులను విష్ చేశారు.అయితే, దీపక్ హుడా తన భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా ఐపీఎల్-2024లో దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అదే ఆఖరుహర్యానాకు చెందిన దీపక్ హుడా కుడిచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఐపీఎల్లో సత్తా చాటిన 29 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2022లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా దీపక్ హుడా టీమిండియాకు చివరిసారిగా ఆడాడు.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఆయా ఫార్మాట్లలో 153, 368 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3, 6 వికెట్లు తీశాడు. చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో! View this post on Instagram A post shared by Deepak Hooda (@deepakhooda30) -
యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్
Navdeep Saini Gets arried to Girlfriend: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల ప్రేయసి స్వాతి ఆస్తానాను పెళ్లాడాడు. ఈ శుభవార్తను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నవదీప్. ఈ మేరకు.. ‘‘నీతో ఉంటే ప్రతిరోజూ నేను ప్రేమలో పడుతూ ఉంటా.. ఈరోజు నుంచి మేమిద్దరం కలకాలం కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించిన మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అని నవదీప్ సైనీ గురువారం తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ తెవాటియా, సాయికిషోర్, చేతన్ సకారియా, మన్దీప్ సింగ్, మొహ్సిన్ ఖాన్ తదితర భారత క్రికెటర్లు నవదీప్- స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నాల్ కుర్రాడు హర్యానాకు చెందిన నవదీప్ సైనీ 2019లో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో తన టెస్టు ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 8 వన్డేలు, 11 టీ20లు, 2 టెస్టులు ఆడిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. ఆయా ఫార్మాట్లలో 6, 13, 4 వికెట్లు పడగొట్టాడు. కాగా నవదీప్ సైనీ టీమిండియా తరఫున చివరిసారిగా.. శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా మైదానంలో దిగాడు. ఇక ఐపీఎల్లో అతడు గతేడాది రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20) సందర్భంగా ఢిల్లీకి ఆడాడు. ఎవరీ స్వాతి ఆస్తానా?! నవదీప్‌ను పెళ్లాడిన స్వాతి ఆస్తానా ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ వ్లాగర్. ఆమెకు సొంతంగా యూట్యూబ్ చానెల్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 84 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక తమ వివాహ వేడుకలో స్వాతి- నవదీప్ పేస్టల్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. View this post on Instagram A post shared by Navdeep Saini (@navdeep_saini10_official) చదవండి: ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. -
హల్దీ మెగా వేడుకలో వరుణ్ - లావణ్య
-
పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా?
‘అవును’ ఫేం పూర్ణ(షమ్నా కాసిమ్) ఇటివలె దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపావేత్తతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఆమె పెళ్లి జరగగా ఈ విషయాన్ని లేట్‌గా రివీల్ చేసింది ఈ కేరళ కుట్టి. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో దుబాయ్‌లో తన పెళ్లి వేడుక జరిగినట్లు తెలిపింది. అయితే దీపావళి సందర్భంగా అందరికి సర్ప్రైజ్ ఇస్తూ తన వివాహనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో పూర్ణ ఒంటినిండా బంగారంతో మెరిసిపోయింది. దీంతో ఆమె వేసుకున్న బంగారం ఎంతనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక దీని గురించి ఆరా తీయగా పూర్ణ వేసుకున్న ఆ బంగారు నగలను ఆమె భర్త కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 1700 గ్రాములు(170 తులాలు) బంగారం పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చాడని సమాచారం. అంతేకాదు బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లా కూడా తన పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చాడట. కాగా దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో మే నెల 31న పూర్ణ నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 12వ తేదీన దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహం జరిగిందని రీసెంట్గా అధికారికంగా ప్రకటించింది. కాగా పూర్ణ ప్రస్తుతం ఓ డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ -
మరదలి పెళ్లిలో చెర్రీ సందడి.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన చెల్లెలు అనుష్ప వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చాలా కాలంగా అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా పాల్గొంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ నుంచి మొదలు.. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతి చిన్న వేడుకకు చెర్రీ హాజరై సందడి చేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఈ పెళ్లి వేడుకలు మొదలైన రోజు నుంచి ప్రతి అప్డేట్ ను, ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది. తాజాగా పెళ్లి ఘనంగా ముగిసిదంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఉపాసన. తన చెల్లెలు పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇది తన జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. అలాగే తన చెల్లెలు పెళ్లికి అందరూ అందించిన విషెస్, ప్రేమకు థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.వాటిలో ఉపాసన, రామ్ చరణ్ గ్రాండ్ లుక్‌లో కలిపించి అలరిస్తున్నారు. చెర్రీ అయితే షేర్వాని ధరించి రాయల్ లుక్‌లో అదిరిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకలకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సరిగ్గా 24 ఏళ్ల క్రితం 'ఫూలోన్ కా గెహ్నా' (కశ్మీరి సాంప్రదాయం ప్రకారం వధువును పూలతో అలంకరించే వేడుక అని అర్థం)సమయంలో తీసిన ఫోటోలని అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఫోటోలకు వేలసంఖ్యలో లైకులు వచ్చాయి. 1997 ఫిబ్రవరి 18 న వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో ప్రియాంక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు ఈ పూల వేడుకను నిర్వహిస్తారు. ప్రియాంక షేర్ చేసిన ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలో ఆమె ఆడపడుచు మిచెల్ వాద్రా కూడా ఉన్నారు. అయితే 2001లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించారు. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) ఇక గతంలో చీర కట్టులో ఉన్న ఫోటోను షేర్ చేసిన ప్రియాంక గాంధీ.. ఆమె పెళ్లి రోజు పూజా సమయంలోని ఫోటోని షేర్ చేశారు. #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆమె పోస్టుకు ట్యాగ్ చేశారు. ప్రియాంక తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. బనారస్ చీరకట్టుకుని పూజలో కూర్చున్న నవవధువు ప్రియాంక ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) -
ఘనంగా సింగర్ రఘు కుంచె కూతురు వివాహం
-
ఇంటివాడైన హీరో నిఖిల్
-
నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను మాత్రమే కనిపించేలా షేర్ చేసిన తన పెళ్లి ఫొటోలను చూసిన నెటిజన్లు ఏంటి నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పెళ్లి కూతురి దుస్తుల్లో తన భర్తతో కలిసి పూజ చేస్తున్న ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో తన భర్తను కనిపించకుండా ఫొటోను క్రాప్ చేసి ‘మిస్టరీ హస్బెండ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ‘పూర్తి ఫొటోను చూపించండి మేడమ్’ ‘మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు’ ‘మీకు మీరే పెళ్లి చేసుకున్నారా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’) View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Apr 16, 2020 at 9:10am PDT ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాగా వాటిని కొట్టిపారేస్తు వచ్చిన రాఖీ.. చివరకు ఓ ఎన్నారైని పెళ్లి చేసుకున్నానని గతేడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా 2006లో బిగ్‌బాస్ రీయాలిటీ షోతో ఫేమస్ అయిన రాఖీ సావంత్ ‘మస్తీ’, ‘చూరా లీయా హై తుమ్నే’, ‘దిల్ బోలే హడిప్పా’ వంటి సినిమాలలో నటించారు. -
‘మీ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు’
రెండు రోజులుగా ట్విటర్లో #SareeTwitter హాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు చీరకట్టుతో ఉన్న ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేరారు. వివాహం సందర్భంగా తీసిన ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు ప్రియాంక. ‘22 ఏళ్ల క్రితం.. నా పెళ్లి రోజున ఉదయం పూజలో ఉండగా తీసిన ఫోటో’ అనే క్యాప్షన్‌తో ప్రియాంక షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నాటి నుంచి నేటి వరకు మీ అందం చెక్కు చెదరలేదు మేడం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కొందరు నేడు ప్రియాంక వివాహ వార్షికోత్సవంగా భావించి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. Morning puja on the day of my wedding (22 years ago!) #SareeTwitter pic.twitter.com/EdwzGAP3Wt — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 17, 2019 -
శ్రియ పెళ్లి ఫొటోలు.. వైరల్
ప్రముఖ నటి శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ నెల 12 న ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం శ్రియ, ఆండ్రీ కొచ్చీవ్ వివాహానికి సంబంధించిన ఫోటోలతో పాటు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రియ వివాహం జరిగినట్టు తెలుస్తుండగా, ఎరుపు రంగు చీరలో ఈ అమ్మడు మెరిసిపోగా, అండ్రీ బ్లూ కలర్ కుర్తాలో కనిపించాడు. త్వరలోనే ఈ జంట సెలబ్రెటీల కోసం గ్రాండ్‌గా విందు ఇవ్వనున్నట్టు సమాచారం. గతంలోనే వీరి ప్రేమ వ్యవహారంపై ఎన్నో పుకార్లు వచ్చినా ఎవరూ స్పందించలేదు. శ్రియ, అండ్రీల పెళ్లి ఫొటోలను మీరూ ఓ లుక్కేయండి.. చదవండి: రహస్యంగా వివాహం చేసుకున్న శ్రియ -
శ్రియ పెళ్లి వీడియో.. వైరల్
-
పెళ్లికి పిలవండి.. కొత్తగా!
ఆహ్వానం: పెళ్లి...మరువ లేని ఘట్టం. మళ్లీ మళ్లీ తలచుకుని మురిసిపోయే అమూల్య జ్ఞాపకం. కలతలతో నివసించే కపుల్స్ కూడా అలనాటి పెళ్లి ఫొటో చూసినపుడు వారి మొహంపై నవ్వు వెల్లివిరుస్తుంది. మరి అంత గొప్ప అరుదైన ఏకైక సందర్భానికి అందరినీ పిలవాలి కదా... పెళ్లి విశేషాలు చెప్పాలి కదా. మరెలా పిలుస్తున్నారు? గతంలో బంధుమిత్రులు మన ఊళ్లలో చుట్టుపక్కల ఊళ్లలో ... ఇంకా మహా అయితే రాష్ర్ట రాజధానిలో ఉండేవారు. కాబట్టి పిలవడానికి అంత పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఆ సమయంలో అన్ని ఊళ్లు తిరుగుతూ దాన్ని కూడా ఆనందించేవాళ్లం. ఇపుడు ఆ పరిస్థితి లేదు. పరిచయస్థులు ప్రపంచం మొత్తం ఉంటున్నారు. ఊళ్లూ ఇరుగు పొరుగు మొదలుకొని ఐటీ రంగం పుణ్యమా అని బంధుమిత్రులు దేశ విదేశాల్లో ఉంటున్నారు. మరి వారందరినీ ఎలా పిలవడం? ఎంత మందికని ఫోన్లో అన్ని వివరాలు చెప్పగలం? అందుకే ఏ టెక్నాలజీతో అయితే మన వాళ్లందరూ అంతంత దూరం వెళ్లారో అదే టెక్నాలజీతో వారికి పెళ్లి పిలుపు ఇవ్వాలి. దానికి అత్యుత్తమ మార్గం వెబ్సైట్. వెబ్సైట్ దాకా ఎందుకు ఈ-మెయిల్ ఇన్విటేషను కూడా సరిపోతుందని కొందరు అనుకుంటారు. అది వెడ్డింగ్ కార్డ్ పంపడానికి బానే ఉంటుంది కాని మీరు ఆహ్వాన పత్రిక ఇచ్చేటపుడు మాట్లాడే కబుర్లన్నీ అందులో చెప్పలేరు. అందుకే వెబ్సైట్ ఉత్తమ మార్గం. మరి దానిని ఎలా క్రియేట్ చేయాలి? ఖర్చవుతుందా? ఉపయోగాలేంటి? పెళ్లంటే ముందు చెప్పాల్సింది.. వధువు/వరుడి గురించి. అయితే, ఇదే వెబ్‌సైట్‌ను ఇద్దరూ అందరికీ పంపుతారు కాబట్టి అందులో ఇద్దరి వివరాలు, చదువు, చిన్న ఇంట్రడక్షన్ ఉంటే మంచిది. అందులోనే రెండు కుటుంబాల గురించి ప్రాథమిక వివరాలు రాసుకోవచ్చు. తర్వాత పెళ్లి వేదిక వివరాలు, ఏర్పాట్ల గురించి వివరించొచ్చు. ఫుడ్ మెను అనేది పెళ్లిలో ఎలాగూ ముందే నిర్ణయించుకునేది కాబట్టి దాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరుచుకోవచ్చు. అలాగే వివాహం, ముహూర్తం, విందు వివరాలన్నీ ఒకే చోట ఉంటే బాగుంటుంది. ఇక పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంతా వస్తారు. అతనేమో అపుడు బిజీగా ఉంటాడు. మరి వచ్చిన ఆ మిత్రులు ఎవర్ని కలవాలి? ఈ వివరాలు కూడా వెబ్సైట్లో పెట్టాలి. వీలైతే మీ నెంబరు కాకుండా మీ ఫ్రెండ్స్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరినైనా ఏర్పాటుచేసి వారి ఫొటోలు, ఫోన్ నెంబర్లు వెబ్సైట్లో పెడితే అతిథులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏ హోటల్లో ఏ రూములు బుక్ చేసింది... వాటి గూగుల్ మ్యాప్స్ అనుసంధానిస్తే అతిథులకు హాయిగా ఉంటుంది. తర్వాత ఎక్కడెక్కడి నుంచో అతిథులు వస్తుంటారు కదా... మీ ఇంటికి/పెళ్లి మండపానికి ఎలా చేరుకోవాలి, ఏ ఏ రవాణా సదుపాయాలున్నాయో, ఏ సమయంలో ఉన్నాయో చెబితే మంచిది. మీ ఊర్లో దిగాక బస్టాండు నుంచి ఇంటికి/వేదికకు వచ్చే మార్గాన్ని వివరించాలి. ఇవన్నీ పెళ్లికి వచ్చేవారికి. మరి ఎవరికైనా కుదరకపోతే వారు మీకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా... ‘విషెష్ బాక్స్’ కూడా పెడితే ఆనందిస్తారు. వీటితో పాటు మీ ఎంగేజ్మెంట్ ఫొటోలు, షాపింగ్ ఫొటోలు, ఆల్బమ్స్ వంటివి కూడా పెట్టొచ్చు. అనుభవాలు, పెళ్లి గురించి భావాలు కూడా రాసేసుకోవచ్చు. ఎంత ఖర్చవుతుంది? ఇది ఖరీదైన వ్యవహారం కాదు. మీకు తెలిసిన వెబ్ డిజైనర్ ఉంటే 2-3 వేలల్లో అయిపోతుంది. లేదంటే ఫ్రీలాన్స్ డిజైనర్‌ను ఆన్లైన్లో వెతుక్కోవచ్చు. ఉదాహరణకు ‘రాగిణివెడ్స్రాము.కామ్’ అని మీ పెళ్లి సైట్‌కు పేరు పెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఆ డొమైన్ నేమ్ వాట్స్యాప్లోనో, ఎస్ఎంఎస్ ద్వారానో చెప్పేయొచ్చు. డబ్బుల్లేకుండా ఉచితంగా పెట్టుకోలేమా అనే వారికి కూడా కొన్ని వేదికలున్నాయి. ఇవే విషయాలను ‘ఒక బ్లాగు’ ఏర్పాటుచేసుకుని అందులో చెప్పొచ్చు. లేదంటే గూగుల్‌కు వెళ్లి ‘క్రియేట్ యువర్ వెడ్డింగ్ వెబ్సైట్’ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే అద్భుతమైన వెడ్డింగ్ టెంప్లేట్స్‌తో ఫ్రీగా మీకు వెబ్సైట్ ఇచ్చే పోర్టల్స్ కూడా ఉన్నాయి. అయితే డొమైన్ నేమ్ కాస్త పెద్దగా ఉంటుంది. -
ఫేస్ బుక్ లో పెళ్లి ఫోటోలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
ఫేస్ బుక్ లో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన భార్య అప్ లోడ్ చేసిందనే కారణంతో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లితండ్రుల ఇష్ణానికి వ్యతిరేకంగా సంధ్య అనే యువతిని ఇటీవల పెళ్లి చేసుకున్న చందన్ సింగ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదంగా మారింది. ఫేస్ బుక్ లో పెళ్లికి సంబంధించిన చిత్రాలను అప్ లోడ్ చేయడాన్ని చందన్ సింగ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించాని.. అంతేకాకుండా చర్చిలో పెళ్లి చేసుకున్న కారణంగా సమాజంలో తమ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దాంతో ఫేస్ బుక్ నుంచి ఫోటోలను తొలగించాలని భర్యతో చందన్ సింగ్ గొడవపడినట్టు.. అందుకు ఆమె నిరాకరించడంతో మరుసటి రోజు ఉదయం తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఫేస్ బుక్ నుంచి ఫోటోలను తొలగించడానికి నిరాకరించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్ లో తెలిపారని పోలీసులు వెల్లడించారు.