ఫేస్ బుక్ లో పెళ్లి ఫోటోలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య! | Software Professional commits suicide: as wife uploads marriage photos on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లో పెళ్లి ఫోటోలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!

Published Mon, Oct 28 2013 1:24 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Software Professional commits suicide: as wife uploads marriage photos on Facebook

ఫేస్ బుక్ లో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన భార్య అప్ లోడ్ చేసిందనే కారణంతో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లితండ్రుల ఇష్ణానికి వ్యతిరేకంగా సంధ్య అనే యువతిని ఇటీవల పెళ్లి చేసుకున్న చందన్ సింగ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదంగా మారింది. 
 
ఫేస్ బుక్ లో పెళ్లికి సంబంధించిన చిత్రాలను అప్ లోడ్ చేయడాన్ని చందన్ సింగ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించాని.. అంతేకాకుండా చర్చిలో పెళ్లి చేసుకున్న కారణంగా సమాజంలో తమ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 
 
దాంతో ఫేస్ బుక్ నుంచి ఫోటోలను తొలగించాలని భర్యతో చందన్ సింగ్ గొడవపడినట్టు.. అందుకు ఆమె నిరాకరించడంతో మరుసటి రోజు ఉదయం తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఫేస్ బుక్ నుంచి ఫోటోలను తొలగించడానికి నిరాకరించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్ లో తెలిపారని పోలీసులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement