Software Professional
-
డ్రగ్స్ కేసులో ఉన్నావంటూ బెదిరించి...
పటాన్చెరు టౌన్: మలేసియాకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నావు.. మనీలాండరింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్నావంటూ బెదిరించి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ. కోటి 58 లక్షల 47 వేలు కాజేశాడు ఓ సైబర్ నేరగాడు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆగస్టు 29వ తేదీన అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వ చ్చి0ది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని, మీపై అక్రమ డ్రగ్స్ రవా ణా అలిగేషన్ ఉందని, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని బెదిరించారు. పేరు తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బెదిరిపోయిన ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.. కోటి 58 లక్షల 47 వేలు పంపాడు. ఇంకా డబ్బులు వే యాలని ఒత్తిడి చేయడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హ్యాపీ జర్నీ
సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. వేసవి సెలవుల కోసం ఎదురు చూపులూ మొదలయ్యాయి. పరీక్షలు పూర్తవడమే తరువాయి, ఓ వారమైనా ఎటైనా వెళ్లి వస్తే తప్ప మనసు రీచార్జ్ కాదు. కొత్త ఏడాదికి సిద్ధం కాదు. ఇదిలా ఉంటే కరోనా వచ్చింది, వెళ్లింది, మళ్లీ వచ్చింది, వెళ్లింది. వేవ్‌ల నంబరు పెరుగుతోంది. మరో వేవ్‌కి సిద్ధంగా ఉండమనే సూచనలు షురూ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ‘క్షేమంగా వెళ్లి, సంతోషంగా రావాలి’ అంటే ఏం చేయాలి? దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించిన హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ నీలిమ... కరోనా జాగ్రత్తల గురించి సాక్షితో పంచుకున్న వివరాలివి. వర్క్ ఫ్రమ్ వెకేషన్! ‘‘కరోనా నా ట్రావెల్ లైఫ్‌ను పెద్ద మలుపు తిప్పింది. నేను 2015 నుంచి కరోనా లాక్డౌన్ వరకు 60 దేశాల్లో పర్యటించాను. ఇండియా టూర్ వార్ధక్యం వచ్చిన తర్వాత అనుకునేదాన్ని. లాంగ్ వీకెండ్ వస్తే ఏదో ఒక దేశానికి వెళ్లిపోయేదాన్ని. కరోనాతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపి వేయడంతో మనదేశంలో పర్యటించడం మొదలుపెట్టాను. ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్ మినహా ఇండియాని దాదాపుగా చూసేశాను. ఈ సంక్రాంతికి కూడా ఓ వారం అనుకుని వెళ్లిన పాండిచ్చేరి వెకేషన్‌ని నెలకు పొడిగించుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్‌ని వర్క్ ఫ్రమ్ వెకేషన్‌గా మార్చుకున్నాను. నేను చూసినంత వరకు జనంలో కరోనా భయం దాదాపుగా పోయిందనే చెప్పాలి. దేశంలో 99 శాతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. కో మార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్లు డాక్టర్ సలహా తీసుకుని బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న తర్వాత మాత్రమే టూర్లు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమస్యలు లేని వాళ్లయితే ఏ మాత్రం సందేహం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. అనేక పర్యాటక ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే ప్రవేశం లేదనే బోర్డులున్నాయి, కానీ మాస్క్ నిబంధన మీద పట్టింపుగా కనిపించలేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉన్న చోట్ల తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. ప్రకృతి పిలుస్తోంది! కరోనా భయం ఓ పక్క వెంటాడుతూనే ఉంది, కాబట్టి పర్యటనలకు ప్రకృతి ఒడినే ట్రావెల్ డెస్టినేషన్‌గా మార్చుకోవడం మంచిది. జలపాతాలు, సముద్ర తీరాలు, నదీతీరాలు, ట్రెకింగ్, స్కీయింగ్ జోన్లను ఎంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో మనుషుల రద్దీ తక్కువగా ఉంటుంది. మాస్కు లేకుండా హాయిగా విహరించగలిగిన ప్రదేశాలివి. హిమాలయాల్లో ట్రెకింగ్‌కి మంచి లొకేషన్లున్నాయి. స్పితి వ్యాలీ, త్రియుండ్ కుండ్, కీర్‌గంగ, రూప్‌కుండ్, బ్రిబ్లింగ్, థషర్ మషర్ ట్రెక్, బ్రమ్‌తాల్, పిన్ పార్వతి, హమ్తా పాస్ ట్రెక్‌లను దాదాపుగా అందరూ చేయవచ్చు. యూత్‌కి హిమాలయాల్లో పన్నెండు రోజులపాటు సాగే సర్పాస్ ట్రెక్ మంచి థ్రిల్‌నిస్తుంది. నేను కశ్మీర్– గుల్మార్గ్, ఉత్తరాఖండ్– ఔలిలలో ఐస్‌స్కీయింగ్, ఆరోవిల్లెలో సర్ఫింగ్ కరోనా విరామాల్లోనే చేశాను. చార్‌థామ్ యాత్రలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, కానీ యాత్ర ముగించుకుని ఫ్లయిట్ ఎక్కిన తర్వాత భయం వేసింది. ఆ టూర్ అంతటిలో తుమ్ములు, దగ్గులు వినిపించింది ఫ్లయిట్లోనే. శాంతియాత్ర లాక్డౌన్ విరమించిన తర్వాత నా ట్రావెల్ లిస్ట్‌లో ఈజిప్టు, టర్కీ దేశాలు చేరాయి. పాండిచ్చేరి బీచ్‌లో సర్ఫింగ్, ఆరోవిల్లెలో మెడిటేషన్ నాకు అత్యంత సంతోషాన్నిచ్చాయి. జీవితంలో శాంతికంటే మరేదీ ముఖ్యంకాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే అరోవిల్లెకి మరో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎస్‌కి వెళ్లి నా వందదేశాల టార్గెట్‌ని పూర్తి చేయాలనేది కోరిక’’ అని చెప్పారు గమనంలోనే గమ్యాన్ని వెతుక్కుంటున్న నీలిమ. వర్క్ చేస్తూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారామె. ఇలాంటి పర్యాటక ప్రియుల వల్లనే ‘వర్కేషన్’ అనే పదం పుట్టింది. కేర్‌ఫుల్‌గా వెళ్లిరండి! కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేతులను తరచు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ, ఆహారపానీయాల పరిశుభ్రత పాటిస్తూ హాయిగా పర్యటించవచ్చనేది నా అభిప్రాయం. అయితే పర్యాటక ప్రదేశాల్లో షాపింగ్ కోసం మార్కెట్లలో ఎక్కువ సేపు గడపకపోవడమే శ్రేయస్కరం. నేను గమనించిన ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... కాశీ అనగానే అది అరవై దాటిన తర్వాత వెళ్లే ప్రదేశం అనుకునే దాన్ని, ఇటీవల అది యూత్ ట్రావెల్ డెస్టినేషన్ అయింది. అక్కడ డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. – పొనుగోటి నీలిమారెడ్డి, ట్రావెలర్ – వాకా మంజులారెడ్డి -
సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే గాడిదలు పెంచుకోవడం నయం!
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఒకరికి కింద భయపడుతూ పని చేయడం కంటే సొంత వ్యాపారం మేలనుకున్నాడో గ్రాడ్యుయేట్. చీటికి మాటికి బాసులు పెట్టే టార్చర్లు భరించడం కంటే జంతువులతో మసలుకోవడం మేలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఫార్మ్‌హౌస్ బాట పట్టాడు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరుకు పేరు. ఒక్క కర్నాటక యువతనే కాదు దేశం నలుమూలల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం యువతరం బెంగళూరు వైపు చూస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆధారంగా అనేక స్టార్టప్‌లు పుట్టుకు వచ్చి యూనికార్న్ కంపెనీలుగా ఎదిగిన ఘనత కూడా ఈ నగరానికే సొంతం. అలాంటి బెంగళూరు నగరం వీడిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు పల్లెబాట పట్టాడు. గాడిదలు పెంచుకుంటూ లక్షలు కూడబెడుతున్నాడు. సాఫ్ట్వేర్ వదిలి శ్రీనివాస గౌడ్ అందరిలాగే గ్రాడ్యుయేష్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ కలలతో బెంగళూరులో వాలిపోయాడు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గ కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ ముందు వాలిపోయాడు. కానీ ఒకరి కింద పని చేయడంలో ఉండే అసంతృప్తి అతన్ని వేధించాయి. తన మనసుకు నచ్చిన పని చేయాలని డిసైడ్ అయ్యాడు. కడక్తో మొదలు కోవిడ్ కల్లోలం 2020లో ప్రపంచాన్ని పలకరించింది. బెంగళూరు వీడి దక్షిణ కన్నడ జిల్లాలోని సొంతూరైన ఐరాకు చేరుకున్నాడు. అప్పుడే తెలిసింది తన మనసు ఏం కోరుతుందో. వెంటనే జాబ్‌కు రిజైన్ చేశాడు. ఇంటి దగ్గరున్న రెండున్నర ఎకరాల స్థలంలో కడక్‌నాథ్ కోళ్లు, కుందేళ్ల పెంపకం ప్రారంభించాడు. కంప్యూటర్ ముందు కాలు కదపకుండా పని చేయాలనే భావనలో యువత ఉంటే, చిత్రంగా కోళ్లు, కుందేళ్లు అంటూ పరితపించే శ్రీనివాస్‌ను అంతా వింతగా చూశారు. గాడిదల కోసం రెండేళ్లు గడిచిన తర్వాత మార్కెట్ మరింతగా అర్థమైంది శ్రీనివాస్‌కి. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అతని పేరు వెలుగులోకి రావడానికి కారణమైంది. ఎవ్వరి ఊహకు అందని విధంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మేలురకం గాడిదల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఓ రేంజ్ వరకు కోళ్లు, కుందేళ్లు ఒకే కానీ ఈ గాడిదల పెంపకం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా అన్నట్టుగా చూశారు అంతా. మార్కెటింగ్ కర్నాటక అంతా గాలించి చివరకు 20 గాడిదలు సాధించి వాటితో ఫామ్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి గాడిద పాలు మార్కెటింగ్ చేయడం కోసం బెంగళూరుతో పాటు కర్నాటకలో ఉన్న ఇతర నగరాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి అతనికి నిరాశ ఎదురు కాలేదు. ఊహించినదాని కంటే అనేక రెట్లు అధికంగా రెస్పాన్స్ వచ్చింది. మాకు కావాలంటే మాకు కావాలంటూ బయ్యర్లు ఎగబడ్డారు. నా అంచనా నిజమైంది - శ్రీనివాసగౌడ గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికీ చిన్న పిల్లల్లో ఉబ్బసం వ్యాధికి ఔషధంగా గాడిద పాలు పట్టిస్తారు. అయితే ఆ రోజుల్లో ఊళ్లలో రజకల దగ్గర గాడిదలు ఉండేవి. బరువులు మోసే పనులకు వీటిని ఉపయోగించేవారు. కానీ మెషినరీ పెరిగిపోయిన తర్వాత అన్ని చోట్ల గాడిదల సంతతి తగ్గిపోతుంది. గాడిద పాలు దొరకం లేదనే విషయం గమనించాను. అందుకే గాడిదలో ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడందరూ నన్నో పిచ్చోడిలా చూశారు. కానీ ఫామ్ ఏర్పాటు చేసిన ఆరు నెలలకే నాకు రూ. 17 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఇవి సప్లై చేయడమే కష్టంగా ఉంది. ఇంకా డిమాండ్ కూడా పెరుగుతోంది. చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో -
చదివింది ఐదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్
న్యూఢిల్లీ: కష్టపడితే విద్యార్హతలతో సంబంధం లేకుండా మెరుగైన ఉద్యోగం సాధించవచ్చని బెంగుళూరుకు చెందిన మహ్మద్ తన్వీర్ నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ తన్వీర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు. ఆ తర్వాత వెల్డర్‌గా కొంత కాలం పని చేశాడు. కానీ అతనికి జరిగిన ఓ ప్రమాదం తన్వీర్ జీవితాన్నే మార్చేసింది. అప్పుడే అతను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీలు లేకపోయినా సరే, పెద్ద ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రమాదం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో..మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు చేస్తున్న తన్వీర్ సోదరి అతడిని ఎంతగానో ప్రోత్సహించింది. ఆమె సహాయంతో అతను ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. తరువాత టైపింగ్ కోర్సు చేసి డాటా ఎంట్రీ ఉద్యోగం సంపాదించాడు. కానీ తన్వీర్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. దీంతో తొలుత అతను డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈవో స్పెషలిస్ట్ ఉద్యోగాలు చేశాడు. సాఫ్ట్వేర్ కొలువు సాధించాలని ఉన్నా డిగ్రీ అర్హతలు లేకపోవడంతో అతని మనసులో ఏదో మూలన నిరాశ తొంగిచూసేది. సరిగ్గా అదే సమయంలో మాసై స్కూల్ ఆఫ్ బిజినెస్ అతని లక్ష్యానికి దారి చూపింది. ఏ అర్హతలు లేకున్నా అతనికి 6నెలల కోడింగ్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కల్పించింది. కేవలం 6నెలల్లోనే తనకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సాధించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందించింది. దీంతో నేడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నానని తన్వీర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని..వారి విద్యార్హతలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాసై సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ శుక్లా పేర్కొన్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నయ్యా! నాదో చిన్న ప్రాబ్లమ్. ఒకబ్బాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాను. అతనే ప్రపోజ్ చేశాడు. తను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేరవుతున్నా. మా మధ్య చిన్న మిస్ అండర్స్టాండింగ్. మేము ఇప్పుడు నెల రోజులుగా మాట్లాడుకోవట్లేదు. నాకేమో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ అబ్బాయి గురించి ఇంట్లో చెబుదామంటే... మాకే అండర్స్టాండింగ్ లేదు, ఇక పెద్ద వాళ్లతో ఎలా చెప్పగలను... అని ఆలోచిస్తున్నాను. మా పేరెంట్స్ ఒప్పుకోరేమో అని భయంగా ఉంది. వాళ్లను ఎలా ఒప్పించాలి. అతడు చాలా మంచివాడు. బహుశా ఆఫీస్ పని ఒత్తిడి వల్ల కావచ్చు, నాతో మాట్లాడడం లేదు. బహుశా! అబ్బాయిలు ఇలాగే ఉంటారేమో! తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ప్లీజ్ అన్నయ్యా! సలహా ఇవ్వండి! – సోనీ గుడ్ మార్నింగ్! నన్ను మీరు ఇప్పటి దాకా కలవలేదు. నా పేరు అరటిపండు. తరచూ వీళ్లిద్దరూ నన్ను మింగేస్తూ ఉంటారు. అందుకే మాట్లాడే చాన్సు దొరకలేదు. ఇవాళ నా కష్టం చెప్పుకునే అవకాశం దొరికింది. పైన మచ్చలు ఉన్నా లోపల శుభ్రంగా ఉంటాను. పైన కరుకుగా ఉన్నా లోపల మెత్తగా ఉంటాను. పైన వగరుగా ఉన్నా లోపల తియ్యగా ఉంటాను. లవ్ కూడా అంతే. తోలు వలిస్తే కానీ విషయం తెలియదు. దాపరికాలు వద్దు... ఓపెన్‌గా మాట్లాడు సోనీ! అంతా మంచే జరుగుతుంది. నేను ఆన్సర్ చెప్పానని ‘ఆ ఇద్దరికీ’ చెప్పకు. తెలిస్తే నన్ను పెరుగులో నంజుకుంటారు. ఆల్ ది బెస్ట్. -
ఫేస్ బుక్ లో పెళ్లి ఫోటోలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
ఫేస్ బుక్ లో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన భార్య అప్ లోడ్ చేసిందనే కారణంతో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లితండ్రుల ఇష్ణానికి వ్యతిరేకంగా సంధ్య అనే యువతిని ఇటీవల పెళ్లి చేసుకున్న చందన్ సింగ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదంగా మారింది. ఫేస్ బుక్ లో పెళ్లికి సంబంధించిన చిత్రాలను అప్ లోడ్ చేయడాన్ని చందన్ సింగ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించాని.. అంతేకాకుండా చర్చిలో పెళ్లి చేసుకున్న కారణంగా సమాజంలో తమ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దాంతో ఫేస్ బుక్ నుంచి ఫోటోలను తొలగించాలని భర్యతో చందన్ సింగ్ గొడవపడినట్టు.. అందుకు ఆమె నిరాకరించడంతో మరుసటి రోజు ఉదయం తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఫేస్ బుక్ నుంచి ఫోటోలను తొలగించడానికి నిరాకరించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్ లో తెలిపారని పోలీసులు వెల్లడించారు.