డ్రగ్స్‌ కేసులో ఉన్నావంటూ బెదిరించి... | A cyber criminal extorted money from a software employee | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో ఉన్నావంటూ బెదిరించి...

Published Thu, Sep 5 2024 4:21 AM | Last Updated on Thu, Sep 5 2024 4:21 AM

A cyber criminal extorted money from a software employee

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి 1,58,47,000 కాజేసిన సైబర్‌ నేరగాడు  

పటాన్‌చెరు టౌన్‌: మలేసియాకు అక్రమంగా డ్రగ్స్‌ రవాణా చేస్తున్నావు.. మనీలాండరింగ్‌ కేసులో అనుమానితుడిగా ఉన్నావంటూ బెదిరించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ. కోటి 58 లక్షల 47 వేలు కాజేశాడు ఓ సైబర్‌ నేరగాడు. 

పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఆగస్టు 29వ తేదీన అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌  వ చ్చి0ది. కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, మీపై అక్రమ డ్రగ్స్‌ రవా ణా అలిగేషన్‌ ఉందని, అదేవిధంగా మనీ లాండరింగ్‌ కేసులో మీ పేరు ఉందని బెదిరించారు. 

పేరు తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బెదిరిపోయిన ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ.. కోటి 58 లక్షల 47 వేలు పంపాడు. ఇంకా డబ్బులు వే యాలని ఒత్తిడి చేయడంతో  సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement