
ప్రముఖ నటి శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ నెల 12 న ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం శ్రియ, ఆండ్రీ కొచ్చీవ్ వివాహానికి సంబంధించిన ఫోటోలతో పాటు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం శ్రియ వివాహం జరిగినట్టు తెలుస్తుండగా, ఎరుపు రంగు చీరలో ఈ అమ్మడు మెరిసిపోగా, అండ్రీ బ్లూ కలర్ కుర్తాలో కనిపించాడు. త్వరలోనే ఈ జంట సెలబ్రెటీల కోసం గ్రాండ్‌గా విందు ఇవ్వనున్నట్టు సమాచారం. గతంలోనే వీరి ప్రేమ వ్యవహారంపై ఎన్నో పుకార్లు వచ్చినా ఎవరూ స్పందించలేదు. శ్రియ, అండ్రీల పెళ్లి ఫొటోలను మీరూ ఓ లుక్కేయండి..
చదవండి: రహస్యంగా వివాహం చేసుకున్న శ్రియ
Comments
Please login to add a commentAdd a comment