రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ | Actress Shriya Saran Marries Russian Boyfriend Andrei Koscheev | Sakshi
Sakshi News home page

రహస్యంగా వివాహం చేసుకున్న శ్రియ

Published Sat, Mar 17 2018 1:02 PM | Last Updated on Sat, Mar 17 2018 7:57 PM

Actress Shriya Saran Marries Russian Boyfriend Andrei Koscheev - Sakshi

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రియ శరన్‌  రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ ను పెళ్లాడారు. వీరి ప్రేమ వ్యవహారం కొంతకాలంగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఇద్దరూ వివాహబంధంతో ఒకటి కాబోతున్నారనీ ఇటీవల పుకార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని శ్రియ తల్లి ఖండించారు కూడా. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని శ్రియ కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ శ్రియ మాటలు అబద్ధమై.. పుకార్లు నిజమయ్యాయి. శ్రియ పెళ్లి అయిపోయిందనే వార్తే ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌.

అతికొద్ది మంది బంధువుల సమక్షంలో మార్చి 12 న ముంబైలో శ్రియ, ఆండ్రీల వివాహం జరిగిందని తెలుస్తోంది. ఈ నెల 11 న ప్రీ వెడ్డింగ్‌ వేడుక జరుపుకున్న ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్‌ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించినట్టు సమాచారం. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో శ్రియ పింక్‌ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయినట్టు సన్నిహితులు తెలిపారు. ఎన్ని పుకార్లు వచ్చినా వాటన్నింటినీ కొట్టిపారేస్తూ శ్రియ రహస్య వివాహం చేసుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చారు. అయితే ఈ విషయంపై  శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇష్టం చిత్రంతో 2001లో వెండితెరకు వచ్చిన శ్రియ నటిగా మంచి గుర్తింపు పొంందారు. కోలీవుడ్‌లో శివాజీ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించారు. అదే విధంగా టాలీవుడ్‌లోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్స్‌తో నటించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవల గాయత్రి సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంత రాయలు’, తమిళ్‌లో నరగసూరన్‌, హిందీలో తడ్కా చిత్రాల్లో నటిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement