స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ నెల 12 న ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం శ్రియ, ఆండ్రీ కొచ్చీవ్ వివాహానికి సంబంధించిన ఫోటోలతో పాటు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.