marriage video
-
పెళ్లి పీటలెక్కిన నరేష్, పవిత్ర
-
'మనోజ్ వెడ్స్ మౌనిక' పెళ్లి వీడియో
-
సర్ప్రైజ్.. నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి టీజర్ వచ్చేసింది
కోలీవుడ్ నూతన దంపతులు నయనతార-విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వీడియో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ అందించింది. వీరి పెళ్లి వీడియోకు సంబంధించిన టీజర్‌ను తాజాగా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో నయన్-విఘ్నేశ్‌లు తమ ప్రేమకు సంబంధించిన మధుర క్షణాలను పంచుకున్నారు. వారి తమ ప్రమే బంధం గురించి వివరిస్తుండగా మధ్యలో వారికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలతో ఆసక్తిగా టీజర్‌ను మలిచారు. కాగా వీరి పెళ్లి వేడుకకు వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ నయన్ దంపతులతో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ నయన్-విఘ్నేశ్‌లకు ఫ్యాన్సీ రెటుకు డీల్ కుదుర్చుకుంది. దాదాపు అయిదేళ్లు ప్రేమలో మునిగితేలిన నయన్-విఘ్నేశ్‌లు గత జూన్ 9న వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లికి కోలీవుడ్‌కు సంబంధి సినీ తారలు, బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా నయన్ దంపతులు ఈ పెళ్లి డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
రెండు సాంప్రదాయల్లో నటి పెళ్లి, వీడియో షేర్ చేసిన ‘నాగిని’ బ్యూటీ
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గురువారం(జనవరి 27న) ఉదయం గోవాలో మలయాళీ, బెంగాలీ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అయితే మౌనీ రాయ్వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వీడియో ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ పెళ్లి, సంగీత్, హల్దీ ఈవెంట్ ఫొటోలను మాత్రం బయటకు వచ్చాయి. దీంతో ఆమె పెళ్లి వీడియో చూసేందుకు ఆమె ఫ్యాన్స్ నెటిజన్లు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాగిని బ్యూటీ నిన్న(బుధవారం) బెంగాలీ పద్దతిలో జరిగిన తన పెళ్లి వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం
నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టి విషయం తెలిసిందే. నిహారిక, చైతన్యల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ చైతన్యపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు నిహారిక. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లిలో జరిగిన కొన్ని కీలకమైన దృశ్యాలను కట్ చేసి ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. ఇందులో నిహారికను పెళ్లి కూతురిని చేస్తున్నప్పటి నుంచి తాళి కట్టే సందర్భం, పెళ్లి వేడుకలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు, ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ఇక తాళి కడుతున్న సందర్భంలో నిహారిక తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. చదవండి: మాటలు తగ్గించేసింది: నాగబాబు ఎమోషనల్ అలాగే పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో నిహారిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ''డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది'' అని పేర్కొన్నారు చైతన్య. ఇక కాబోయే వాడు అంతా ప్రేమగా ఈ మాటలు చెప్పడంతో అది విన్న నిహారిక పట్టరానంత ఆనందంతో ఏడ్చేశారు. కళ్యాణ తిలకం దిద్దుతున్న చిరంజీవి కూతూరు సుష్మితను హత్తుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి : హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్ యూ.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ఘనంగా జరిగిన రానా- మిహికాల హాల్దీ ఫంక్షన్
-
చై, సామ్ మ్యారేజ్ ప్రోమో
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, సమంతలు గతేడాది వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరు తమ జీవితంలోని ముఖ్యమైన ఘటనల గురించి అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. మిగతా సెలబ్రిటీల మాదిరి వీరి వివాహ వేడుకకు సంబంధించించి ఎటువంటి వీడియోలు బయటకి రాలేదు. వారి పెళ్లి వేడుక ఎలా జరిగిందో చూడాలనే కోరిక అభిమానుల్లో ఉంది. దీంతో సమంత తమ పెళ్లి వేడుకకు సంబంధించిన చిన్నపాటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే.. చై సామ్ వివాహ వేడుకలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో నాగ చైతన్య.. టై ఎక్కడ అంటూ.. అఖిల్‌ను అడుగుతారు. సమంత వీ కెన్ డూ దిస్ అంటూ చిన్నగా డ్యాన్స్ చేస్తూ కనబడుతారు. పెళ్లిలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించిన షార్ట్ అండ్ స్వీట్ విజువల్స్‌ని ఇందులో పొందుపరిచారు. ఈ వీడియో ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన జోసెఫ్రాధిక్.. సమంత అతన్ని దేశంలోనే బెస్ట్‌గా పేర్కొన్నారు. ఈ వీడియో చాలా అందంగా ఉంది. మీ ఇద్దరికి దేవుడి దీవెనలు ఉండాలంటూ.. సమంత పోస్ట్‌పై రకుల్‌ప్రీత్ సింగ్ కామెంట్ చేశారు. అభిమానులు కూడా ఈ వీడియో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. -
శ్రియ పెళ్లి వీడియో.. వైరల్