
కోలీవుడ్ నూతన దంపతులు నయనతార-విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వీడియో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ అందించింది. వీరి పెళ్లి వీడియోకు సంబంధించిన టీజర్‌ను తాజాగా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో నయన్-విఘ్నేశ్‌లు తమ ప్రేమకు సంబంధించిన మధుర క్షణాలను పంచుకున్నారు. వారి తమ ప్రమే బంధం గురించి వివరిస్తుండగా మధ్యలో వారికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలతో ఆసక్తిగా టీజర్‌ను మలిచారు. కాగా వీరి పెళ్లి వేడుకకు వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ నయన్ దంపతులతో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’
వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ నయన్-విఘ్నేశ్‌లకు ఫ్యాన్సీ రెటుకు డీల్ కుదుర్చుకుంది. దాదాపు అయిదేళ్లు ప్రేమలో మునిగితేలిన నయన్-విఘ్నేశ్‌లు గత జూన్ 9న వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లికి కోలీవుడ్‌కు సంబంధి సినీ తారలు, బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా నయన్ దంపతులు ఈ పెళ్లి డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment