
'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గురువారం(జనవరి 27న) ఉదయం గోవాలో మలయాళీ, బెంగాలీ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..
అయితే మౌనీ రాయ్‌వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వీడియో ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ పెళ్లి, సంగీత్, హల్దీ ఈవెంట్ ఫొటోలను మాత్రం బయటకు వచ్చాయి. దీంతో ఆమె పెళ్లి వీడియో చూసేందుకు ఆమె ఫ్యాన్స్ నెటిజన్లు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాగిని బ్యూటీ నిన్న(బుధవారం) బెంగాలీ పద్దతిలో జరిగిన తన పెళ్లి వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..
Comments
Please login to add a commentAdd a comment