కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకలకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సరిగ్గా 24 ఏళ్ల క్రితం 'ఫూలోన్ కా గెహ్నా' (కశ్మీరి సాంప్రదాయం ప్రకారం వధువును పూలతో అలంకరించే వేడుక అని అర్థం)సమయంలో తీసిన ఫోటోలని అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఫోటోలకు వేలసంఖ్యలో లైకులు వచ్చాయి. 1997 ఫిబ్రవరి 18 న వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో ప్రియాంక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు ఈ పూల వేడుకను నిర్వహిస్తారు. ప్రియాంక షేర్ చేసిన ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలో ఆమె ఆడపడుచు మిచెల్ వాద్రా కూడా ఉన్నారు. అయితే 2001లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె మరణించారు.
ఇక గతంలో చీర కట్టులో ఉన్న ఫోటోను షేర్ చేసిన ప్రియాంక గాంధీ.. ఆమె పెళ్లి రోజు పూజా సమయంలోని ఫోటోని షేర్ చేశారు. #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆమె పోస్టుకు ట్యాగ్ చేశారు. ప్రియాంక తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. బనారస్ చీరకట్టుకుని పూజలో కూర్చున్న నవవధువు ప్రియాంక ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment