Actress Poorna Gifted 1700 Grams Gold, Luxury Villa From Her Husband - Sakshi
Sakshi News home page

Actress Poorna: పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చిన బంగారం ఎంతో తెలుసా?

Oct 26 2022 11:17 AM | Updated on Oct 26 2022 12:03 PM

Actress Poorna Gifted 1700 Grams Gold, Luxury Villa From Her Husband - Sakshi

పూర్ణ వేసుకున్న ఆ బంగారు నగలను ఆమె భర్త కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 1700 గ్రాములు(170 తులాలు బంగారం పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చాడని సమాచారం. అంతేకాదు బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లా కూడా తన పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చాడట.

‘అవును’ ఫేం పూర్ణ(షమ్నా కాసిమ్‌) ఇటివలె దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపావేత్తతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఆమె పెళ్లి జరగగా ఈ విషయాన్ని లేట్‌గా రివీల్‌ చేసింది ఈ కేరళ కుట్టి. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో దుబాయ్‌లో తన పెళ్లి వేడుక జరిగినట్లు తెలిపింది.

అయితే దీపావళి సందర్భంగా అందరికి సర్‌ప్రైజ్‌ ఇస్తూ తన వివాహనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో పూర్ణ ఒంటినిండా బంగారంతో మెరిసిపోయింది. దీంతో ఆమె వేసుకున్న బంగారం ఎంతనేది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇక దీని గురించి ఆరా తీయగా పూర్ణ వేసుకున్న ఆ బంగారు నగలను ఆమె భర్త కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 1700 గ్రాములు(170 తులాలు) బంగారం పెళ్లి కానుకగా పూర్ణకు ఆమె భర్త ఇచ్చాడని సమాచారం. అంతేకాదు బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లా కూడా తన పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చాడట.



కాగా దుబాయ్‌కు చెందిన  షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో మే నెల 31న పూర్ణ నిశ్చితార్థం చేసుకుంది. జూన్‌ 12వ తేదీన దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహం జరిగిందని రీసెంట్‌గా అధికారికంగా ప్రకటించింది. కాగా పూర్ణ ప్రస్తుతం ఓ డాన్స్‌ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి
దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement