బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను మాత్రమే కనిపించేలా షేర్ చేసిన తన పెళ్లి ఫొటోలను చూసిన నెటిజన్లు ఏంటి నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పెళ్లి కూతురి దుస్తుల్లో తన భర్తతో కలిసి పూజ చేస్తున్న ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో తన భర్తను కనిపించకుండా ఫొటోను క్రాప్ చేసి ‘మిస్టరీ హస్బెండ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ‘పూర్తి ఫొటోను చూపించండి మేడమ్’ ‘మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు’ ‘మీకు మీరే పెళ్లి చేసుకున్నారా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’)
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాగా వాటిని కొట్టిపారేస్తు వచ్చిన రాఖీ.. చివరకు ఓ ఎన్నారైని పెళ్లి చేసుకున్నానని గతేడాది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా 2006లో బిగ్‌బాస్ రీయాలిటీ షోతో ఫేమస్ అయిన రాఖీ సావంత్ ‘మస్తీ’, ‘చూరా లీయా హై తుమ్‌నే’, ‘దిల్ బోలే హడిప్పా’ వంటి సినిమాలలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment