పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు | Rakhi Sawant Brother Rakesh Opens Up On Her Heart Problem | Sakshi
Sakshi News home page

Rakhi Sawant: ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్.. తనను వేధించారన్న సోదరుడు!

Published Wed, May 15 2024 4:28 PM | Last Updated on Wed, May 15 2024 4:33 PM

Rakhi Sawant Brother Rakesh Opens Up On Her Heart Problem

బాలీవుడ్ నటి  రాఖీ సావంత్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్‌ తీవ్రమైన గుండె సమస్యతో  ముంబయిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.  ఈ విషయాన్ని ఆమె బ్రదర్‌ రాకేశ్‌ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్‌లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్  వెల్లడించారు.

మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్‌ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆదిల్‌పై ఇప్పటివరకు ఛార్జ్‌షీట్‌ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్‌ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement