2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్‌లో సందడి చేస్తున్నాయి
అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.
జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.
Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu
— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024
Comments
Please login to add a commentAdd a comment