Usha Chilukuri Vance
-
అత్తగారి కుటుంబంతో సరదాగా.. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో వైరల్
వాషింగ్టన్ : అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉష చిలుకూరి దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనా.. సాదాసీదాగా నీలిరంగు టీ షర్ట్ ధరించిన జేడీ వాన్స్ తన కుమారుడిని ఎత్తుకున్నారు. తన భార్య ఉష చిలుకూరి తరఫు బంధువులతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోని సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాప్టలిస్ట్ ఆషా జెడేజా మోత్వాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. JD Vance at Thanksgiving -). Reminds me of the big fat Indian wedding…. pic.twitter.com/vzEjODMRZt— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) December 2, 2024జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడేఅమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. వాన్స్‌తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్‌కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 277(270) దాటి సొంతం చేసుకున్న ట్రంప్.. ఆగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఇక యూఎస్ ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ వ్యవహరించనున్నారు. ఇందుకు ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ తెలుగమ్మాయి కావడమే కారణం. ఇక ఉష అమెరికాకు సెకండ్ లేడీగా అవతరించబోతున్నారు.ఉష చిలుకూరి.. కొంతకాలం వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా జేడీ వాన్స్‌ను రిపబ్లికర్ పార్టీ ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసినప్పటి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయంతో ఆమె పేరు మరోసారి మార్మోగుతోంది. నిజానికి వాన్స్ ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి సహ కా రం ఎంతో ఉంది. మరి కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు..ఉషా పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు. తండ్రి రాధాకృష్ణ... క్రిష్ చిలుకూరి ఏరోస్పేస్ ఇంజినీర్.వీరికి ముగ్గురు సంతానం. వారిలో ఒకరు ఉష. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.ఉష యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు.యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు.భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. ఒహాయో సెనేటర్‌గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. తన భర్త ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. ఇక ప్రస్తుతం ఆమె రిపబ్లికన్ల తరఫున సెకండ్ లేడీగా వ్యవహరించనున్నారు. -
ఉషా చిలుకూరిపై ఎలోన్ మస్క్ ట్వీట్ వైరల్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్ ఎంపికయ్యారు. అయితే, జేడీ వాన్స్ ఎంపికతో ఆయన సతీమణి ఉషా చిలుకూరికి భారత్ మూలాలు ఉన్నాయని వెలుగులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.వారిలో అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఉన్నారు.ఇంతకీ ఆయన ఎందుకు స్పందించారు.మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.అంతకంటే ముందే జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ప్రొఫైల్‌ను చూసి తాను ముగ్ధుడినయ్యానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి అభినందనలు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. వారిలో డాక్టర్ పారిక్ పటేల్ ఎక్స్ వేదికగా ఉషా చిలుకూరి ప్రతిభాపాటవాలపై ప్రశంసలు కురిపించారు. You either hire an Indian CEO or live long enough to see yourself become Indian pic.twitter.com/RmcjFaGrtj— Dr. Parik Patel, BA, CFA, ACCA Esq. (@ParikPatelCFA) July 15, 2024 మీరు భారతీయ సీఈవోలని నియమించుకోండి లేదా మీరే భారతీయుల్లా వ్యవహరించండి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఎలోన్ మస్క్ స్పందించారు.భళ్ళున ఓ నవ్వి నవ్వుతూ ఓ స్మైలీ ఎమోజీని ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్ వైరల్‌గా మారింది 😂— Elon Musk (@elonmusk) July 15, 2024 -
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి.. మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి (ఫొటోలు)
-
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి?
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్‌లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.జేడీ వాన్స్ భార్యే ఉషా చిలుకూరి వాన్స్. ఈ ఎన్నికల్లో వాన్స్ గెలిస్తే అమెరికాకి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ (రెండో మహిళ)గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా ఉషా చిలుకూరి ఎవరు? ఆమె తల్లిదండ్రులు, భర్త జేడీ వాన్స్ ఎవరు? అనే వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఎవరీ ఉషా చిలుకూరి? న్యూయార్క్ టైమ్స్ ప్రకారం..అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామమని తెలుస్తోంది. సుధీర్ఘకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో,కాలిఫోర్నియాలో పెరిగారు.ఉషా చిలుకూరి ఏం చదువుకున్నారు?ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.ఆమె లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివారు.ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ పూర్తి చేశారు.ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు.యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలో యేలే లా జర్నల్,టెక్నాలజీ విభాగానికి ఎగ్జిక్యూటీవ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా, మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు.అదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టులో కేసుల్ని ఎలా వాదించాలి? కేసులో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేయాలనే అంశాలపై అమెరికా లా యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన సుప్రీం కోర్టు లాయర్లతో సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సును అందిస్తాయి. ఆ కోర్స్‌లో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌పై పని చేశారు. ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో ఉషా చిలుకూరి జేడీ వాన్స్‌ను తొలిసారి కలుసుకున్నారు. లా కాలేజీలో జరిగిన ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే సబ్జెట్‌పై జరిగిన డిస్కషన్ గ్రూప్‌లో ఉషా, వాన్స్‌లు కలిసి పనిచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. ఇరుకుటుంబసభ్యుల అంగీకారంతో ఉషా చిలుకూరి, జేడీ వాన్స్‌లు ఒక్కటయ్యారు. వారిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది.జేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలుజేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు.ఇవాన్,వివేక్ ఇద్దరు కుమారులు కాగా కుమార్తె మిరాబెల్.ప్రముఖ న్యాయవాదిగాకాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. ఉషా 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌గా పని చేయడం కంటే ముందు 2015 నుండి 2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ ఈలోని ముంగేర్, టోల్లెస్ అండ్ ఓల్సన్ ఎల్ఎల్పీలో న్యాయవాదిగా పనిచేశారు. రాజకీయాల్లో జేడీ వాన్స్వాన్స్ రాజకీయాల కంటే ప్రముఖ వ్యాపార వేత్తగా, ఇన్వెస్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్.. 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ..ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీరవిధేయుల్లో ఒక్కరిగా మారారు. పుస్తకం కాస్త.. సినిమాగాఇక వాన్స్ తనలోని రాజకీయ నాయకుడితో పాటు మంచి రచయిత ఉన్నాడంటూ ‘హిల్‌బిల్లీ ఎలెజీ’తో నిరూపించారు. హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకం ద్వారా సంక్షోభంలో ఉన్నశ్వేతజాతి అమెరికన్ల సంస్కృతి, ఉద్వేగం, వ్యక్తిగతం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వాన్స్ తన జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాల్ని వివరించారు. పేదరికం, వ్యసనం, అస్థిరతతో అతని కుటుంబం, పోషణ కోసం పోరాటాలు, చివరికి తన ప్రయాణం ఎలా సాగిందో వివరించారు. ఆ పుస్తకం ఎక్కువగా అమ్ముడు పోవడంతో అది సినిమాగా తెరక్కిక్కింది. 2020లో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు. ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసిన వాన్స్అంతేకాదు ఈ పుస్తకం ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ట్రంప్ ప్రచారంలో తన సందేశాన్ని బలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద తెల్లజాతి, అమెరికా ఉద్యోగుల ఓటర్లను ఆకర్షించేలా, తనవైపుకు తిప్పుకునేందుకు సహకరించింది. మధ్య అమెరికాలో సాంస్కృతిక, ఆర్థిక అంశాలను లోతుగా విశ్లేషించేందుకు ఉపయోగపడింది. కాగా, 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంలో ఈ ఓటర్లే కీలకమయ్యారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.జేడీ వాన్స్ విజయంలో ఉషా తన భర్త జేడీ వాన్స్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.తరచూ రాజకీయ కార్యక్రమాలకు అతనికి దిశానిర్ధేశం ఇస్తూ మద్దతుగా నిలిచారు. ఆమె 2016,2022లో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రచారం చేశారు. సెనేటర్ అంటే అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్‌గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు.