అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 277(270) దాటి సొంతం చేసుకున్న ట్రంప్.. ఆగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఇక యూఎస్ ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ వ్యవహరించనున్నారు. ఇందుకు ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ తెలుగమ్మాయి కావడమే కారణం. ఇక ఉష అమెరికాకు సెకండ్ లేడీగా అవతరించబోతున్నారు.
ఉష చిలుకూరి.. కొంతకాలం వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా జేడీ వాన్స్‌ను రిపబ్లికర్ పార్టీ ఉపాధ్య అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసినప్పటి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయంతో ఆమె పేరు మరోసారి మార్మోగుతోంది. నిజానికి వాన్స్ ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి సహ కా రం ఎంతో ఉంది. మరి కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు..
ఉషా పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలు. తండ్రి రాధాకృష్ణ... క్రిష్ చిలుకూరి ఏరోస్పేస్ ఇంజినీర్.
వీరికి ముగ్గురు సంతానం. వారిలో ఒకరు ఉష. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.
ఉష యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు.
యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు.
భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. ఒహాయో సెనేటర్‌గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. తన భర్త ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. ఇక ప్రస్తుతం ఆమె రిపబ్లికన్ల తరఫున సెకండ్ లేడీగా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment