
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు

ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్‌లు తలపడనున్నాయి

ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం..అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి

ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామమని తెలుస్తోంది

సుధీర్ఘకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో,కాలిఫోర్నియాలో పెరిగారు















