ఉషా చిలుకూరిపై ఎలోన్‌ మస్క్‌ ట్వీట్‌ వైరల్‌ | Elon Musk respond on about Usha Chilukuri Vance | Sakshi
Sakshi News home page

Usha Chilukuri Vance : భళ్లున నవ్వుతూ.. ఉషా చిలుకూరిపై ఎలోన్‌ మస్క్‌ ట్వీట్‌ వైరల్‌

Published Tue, Jul 16 2024 2:00 PM | Last Updated on Tue, Jul 16 2024 3:58 PM

Elon Musk respond on about Usha Chilukuri Vance

అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్‌ జేడీ వాన్స్‌ ఎంపికయ్యారు. అయితే, జేడీ వాన్స్‌ ఎంపికతో ఆయన సతీమణి ఉషా చిలుకూరికి భారత్‌ మూలాలు ఉన్నాయని వెలుగులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.వారిలో అపర కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ ఉన్నారు.ఇంతకీ ఆయన ఎందుకు స్పందించారు.

మిల్వాకీలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫీస్‌ వేదికగా ట్రంప్‌ రిపబ్లికన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.అంతకంటే ముందే జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ప్రొఫైల్‌ను చూసి తాను ముగ్ధుడినయ్యానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వాన్స్‌ సతీమణి ఉషా చిలుకూరికి అభినందనలు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. వారిలో డాక్టర్ పారిక్ పటేల్ ఎక్స్‌ వేదికగా ఉషా చిలుకూరి ప్రతిభాపాటవాలపై ప్రశంసలు కురిపించారు.  

 

మీరు భారతీయ సీఈవోలని నియమించుకోండి లేదా మీరే భారతీయుల్లా వ్యవహరించండి అంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై ఎలోన్‌ మస్క్‌ స్పందించారు.భళ్ళున ఓ నవ్వి నవ్వుతూ ఓ స్మైలీ ఎమోజీని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement