టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.
తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ
ఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్ హుడా షేర్ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.
మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్ కూడా జతచేశాడు.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు. తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.
శుభాకాంక్షల వెల్లువ
ఈ నేపథ్యంలో కొత్త జంటకు క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, ఖలీల్ అహ్మద్ తదితర భారత క్రికెటర్లతో పాటు మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్), లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. దీపక్ హుడా దంపతులను విష్ చేశారు.
అయితే, దీపక్ హుడా తన భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా ఐపీఎల్-2024లో దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
అదే ఆఖరు
హర్యానాకు చెందిన దీపక్ హుడా కుడిచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఐపీఎల్‌లో సత్తా చాటిన 29 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2022లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా దీపక్ హుడా టీమిండియాకు చివరిసారిగా ఆడాడు.
ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఆయా ఫార్మాట్లలో 153, 368 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3, 6 వికెట్లు తీశాడు.
చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో!
Comments
Please login to add a commentAdd a comment