రెండు రోజులుగా ట్విటర్‌లో #SareeTwitter హాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు చీరకట్టుతో ఉన్న ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేరారు. వివాహం సందర్భంగా తీసిన ఫోటోను తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు ప్రియాంక.
‘22 ఏళ్ల క్రితం.. నా పెళ్లి రోజున ఉదయం పూజలో ఉండగా తీసిన ఫోటో’ అనే క్యాప్షన్‌తో ప్రియాంక షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నాటి నుంచి నేటి వరకు మీ అందం చెక్కు చెదరలేదు మేడం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కొందరు నేడు ప్రియాంక వివాహ వార్షికోత్సవంగా భావించి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.
Morning puja on the day of my wedding (22 years ago!) #SareeTwitter pic.twitter.com/EdwzGAP3Wt
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 17, 2019
Comments
Please login to add a commentAdd a comment