Explosion At Sunny Leone Fashion Show Venue In Imphal, Check Details - Sakshi
Sakshi News home page

సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు..

Published Sat, Feb 4 2023 2:40 PM | Last Updated on Sat, Feb 4 2023 3:14 PM

Explosion At Sunny Leone Fashion Show Venue Imphal - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని హట్ట కంగ్‌జీబాంగ్‌ ప్రాంతంలో శనివారం ఉదయం పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే ఆదివారం నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోకు ప్రముఖ నటి సన్నీలియోన్ హాజరవుతున్నారు. ఈ వేదికకు 100 మీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది.

శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ పేలుడు ఐఈడీ వల్ల జరిగిందా? లేదా గ్రెనేడ్‌తో దాడి చేశారా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు.
చదవండి: రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement