
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి ఫేమస్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనపడితే.. అది సోషల్‌మీడియాలో వైరల్ కాకుండా ఉంటుందా. ప్రస్తుతం అలాంటి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాహో సెట్‌లో దిగిన ఆ ఫోటో అరుణ్ విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో ఇండియన్ సినిమాగా మారిపోయింది. ఈ మూవీలో అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి నీల్ నితిన్ ముఖేష్, శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్‌లు, కోలీవుడ్ నుంచి యంగ్ యాక్టర్ అరుణ్ విజయ్, మాలీవుడ్ నుంచి సీనియర్ యాక్టర్ లాల్ ఇలా ప్రముఖులు సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణంతో అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ప్రస్తుతం జాకీ ష్రాఫ్, ప్రభాస్, లాల్, అరుణ్ విజయ్‌కు సంబంధించిన సన్నివేశాలను యూనిట్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సెట్‌లో అరుణ్ విజయ్ వీరితో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.
Haven’t seen a more cooler person on sets !! Was great catching up with you #jackieshroff sir.. #Prabhas @bindasbhidu #lal #saaho.. 💪 pic.twitter.com/oEC48PEskn
— ArunVijay (@arunvijayno1) 22 January 2019