ఇస్లామాబాద్: భారత నిఘా విభాగానికి చెందిన అధికారిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇండియన్ నేవీలో కమాండర్ స్థాయిలో ఉన్న అధికారి కుల్ యాదవ్ భూషన్ 'రా' సంస్థలో నిఘా అధికారిగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్టు బలోచిస్తాన్ ప్రాంతానికి చెందిన హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బుగి వెల్లడించారు. అనుమతి లేకుండా అధికారి తమ దేశంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపిస్తోంది.
ఈ విషయంపై ఆందోళన చేపట్టి నిరసన తెలిపినందుకు భారత హై కమిషనర్ గౌతమ్ బాంబవాలేకు సమన్లు జారీచేస్తున్నట్లు పాక్ అధికారులు చెబుతున్నారు. బలోచిస్తాన్ వేర్పాటువాదులు, టెర్రరిస్టులతో భారత అధికారికి సంబంధాలు ఉన్నాయని పాక్ అధికారి బుగ్టి అరోపించారు. భారత్ మాత్రం పాక్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భారత నేవీ అధికారిని అరెస్ట్ చేసిన పాక్
Published Fri, Mar 25 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM
Advertisement