
రవితేజ మోస్ట్ వాంటెడ్.. హీరోగా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. ‘ఈగల్’ సినిమాలో కూడా రవితేజ మోస్ట్ వాంటెడ్. సినిమాలో ఆయన్ను పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెతుకుతుంటుంది. కొందరు ఆయన్ను పెయింటర్ అనుకుంటారు.. మరికొందరు రైతు అనుకుంటారు.. ఇంకొందరు ఇంకోటి అనుకుంటారు.
సో.. ఈ చిత్రంలో రవితేజ పలు గెటప్స్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. రవితేజ, అనుపమా పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.
Comments
Please login to add a commentAdd a comment