
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ఈగల్’ చిత్రాన్ని 2024 జనవరి 13న సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రవితేజ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘‘ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్–దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.