పోలాండ్‌లో రవితేజ ఈగిల్‌? | Ravi Teja Eagle Movie Shooting In Poland | Sakshi
Sakshi News home page

పోలాండ్‌లో రవితేజ ఈగిల్‌?

Published Tue, Nov 1 2022 1:56 AM | Last Updated on Tue, Nov 1 2022 8:08 AM

Ravi Teja Eagle Movie Shooting In Poland - Sakshi

రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగిల్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, కావ్యాథాపర్‌  హీరోయిన్స్‌గా నటించనున్నారని టాక్‌. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పోలాండ్‌లో మొదలైందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

రవితేజ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే ఈ సినిమాను అధికారికంగా ఓ టీజర్‌తో ప్రకటించాలని చిత్రయూనిట్‌ భావిస్తోందట. అందుకే పోలాండ్‌లో షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారని భోగట్టా. ఇక ‘ఈగిల్‌’ కాకుండా ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ వంటి సినిమాలు చేస్తున్నారు రవితేజ. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement