ఈగల్‌: రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన 'ఆడు మచ్చా' సాంగ్‌ విన్నారా? | Raviteja: Promo of Aadu Macha from Eagle out | Sakshi
Sakshi News home page

Eagle: ఆడు మచ్చా...సాంగ్‌ విన్నారా?

Published Wed, Dec 6 2023 6:20 AM | Last Updated on Wed, Dec 6 2023 9:41 AM

Raviteja: Promo of Aadu Macha from Eagle out - Sakshi

రవితేజ హీరోగా నటించిన యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ ‘ఈగల్‌’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ , కావ్వా థాపర్‌ హీరోయిన్లుగా, నవదీప్, మధుబాల కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆడు మచ్చా..’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. దావ్‌జాంద్‌ స్వరకల్పనలో కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. ‘‘రవితేజ మల్టీషేడ్స్‌లో నటించిన చిత్రం ఇది. ఓ గ్రామీణ పండగ నేపథ్యంలో ‘ఆడు మచ్చా..’ పాట వస్తుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహ–నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement