థ్రిల్లింగ్‌ ఈగల్‌ | EAGLE Movie New Poster Released: Ravi Teja | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ ఈగల్‌

Published Tue, Jan 2 2024 12:14 AM | Last Updated on Tue, Jan 2 2024 12:14 AM

EAGLE Movie New Poster Released: Ravi Teja  - Sakshi

 రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

కాగా నూతన సంవత్సరం కానుకగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఈగల్‌’. రవితేజని పవర్‌ఫుల్‌ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు కార్తీక్‌. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘2024 ఉషోదయం మీకు ఆశీర్వాదాలు, విజయాలతో పాటు మరపురాని జ్ఞాపకాలను ఇస్తుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ రవితేజ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: దేవ్‌ జాంద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement