భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించుకుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్‌కి కీలక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్‌ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్‌ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు.
అలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోగల వనీ, మన ఊహకు అందని రీతిలో తరచూ అవి జరుగుతూ ఉంటా యనీ, ఆఖరికి ప్రచ్ఛన్న యుద్ధకాలంలోనూ అలాంటి ఘటనలు సాధ్యమేననీ చెప్పే విధంగా గూఢచర్యం చరిత్ర రుజువులతో సహా నిండి ఉంది.
వైరి శిబిరాల ప్రతినాయకులు కలుసుకున్నారు, చర్చించుకున్నారు, పరస్పరం గౌరవాభిమానాలను పెంపొందించుకు న్నారు. కొన్ని సమయాలలో వ్యక్తిగతంగా ప్రేమాభి మానాలు కూడా కురిపించుకున్నారు. మన దాయాది దేశాల గూఢచర్య వ్యవస్థల అధిపతులు– రా అధిపతి ఏఎస్ దౌలత్, ఐఎస్‌ఐ అధినేత అసద్ దురానీల మధ్య నమ్మితీరవలసిన రీతిలో జరిగినట్టు చెబు తున్న ఉమ్మడి కృషి గురించి వెల్లడించిన సంద ర్భంలో భారత్ పాకిస్తాన్ మీడియా ఆనందోత్సాహా లలో మునిగి తేలుతున్నది. ఈ వారం ఈ అపూర్వ మైన అంశం గురించి చర్చించడానికి కారణం అదే. చెప్పుకోదగిన ఇలాంటి చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన వారు పత్రికా రచయిత ఆదిత్య సిన్హా.
నిజానికి ఈ రెండు దేశాల గూఢచారి వ్యవస్థల అధిపతులు (లేదా ఎన్‌ఎస్‌ఏలు) వివిధ అంశాల గురించి చర్చించడానికి సుదూర ప్రాంతాలలో (థాయ్‌లాండ్ అయితే సౌకర్యంగా ఉంటుంది) కలుసుకుంటూ ఉంటారన్నది తెలిసిన విషయమే. ఈ పుస్తకంలో కదలించే కథనం ఒకటి ఉంది. వీసా నిబంధనలను ఉల్లంఘించి, ముంబై విమానాశ్ర యంలో పోలీసులకు దొరికిపోయిన అసద్ దురానీ కుమారుడికి రా ఎలా సహాయ సహకారాలు అందిం చినదీ ఆ కథనం చెబుతుంది. అతడు ఐఎస్‌ఐ మాజీ అధిపతి కుమారుడన్న వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం కూడా వారు ఎవరికీ దక్కనీయలేదు. అప్పటికి దురానీ పదవీ విరమణ చేసి చాలా కాలమే అయింది. కానీ దౌలత్‌కు దురానీ అంటే ఎంతో గుడ్ విల్ ఉంది. దౌలత్ ఆనాటి రా సంస్థ అధిపతి రాజిం దర్ ఖన్నాతో మాట్లాడారు. మన గూఢచారి వ్యవస్థ అధిపతులు కొందరు పదవులలో ఉండగానే రహస్య సంభాషణలు జరిగాయి. రాజీవ్‌గాంధీ హయాంలో రా సంస్థ సంచాలకునిగా పనిచేసిన ఆనంద్‌వర్మ చని పోవడానికి కొంచెం ముందు ‘ది హిందు’ అభిప్రా యవేదికలో విభ్రాంతికరమైన నిజాలను వెల్లడిం చారు.
అవి పేరుమోసిన లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్‌తో ఆయన జరిపిన రహస్య చర్చల వివరాలే. గుల్ అప్పటి ఐఎస్‌ఐ అధిపతి. ఈ చర్చలు ఎక్కు వగా విదేశాలలో జరిగినవే. తరువాత పబ్లిక్ ఫోన్‌ల ద్వారా జరిపినవి. సంకేత భాష, సంకేతాల సాయంతో ఆ చర్చలు జరిగాయి. ఈ చర్చలలో సియాచిన్, కశ్మీర్ వివాదాలలోని తీవ్రతను తగ్గిం చాలని ఆ ఇద్దరు అభిప్రాయపడ్డారు. గుల్ తన పట్ల నమ్మకం కుదిరేటట్టు చేయడానికి ఒక కోవర్ట్ ఆపరే షన్ కూడా నిర్వహించాడు. సిక్కు సైనిక పటాలా లకు చెందిన నలుగురుని అతడు భారత్‌కు అప్ప గించాడు. ఈ నలుగురు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తరువాత పాకిస్తాన్ వైపు ప్లేటు ఫిరాయించి భారత్‌లో తిరుగుబాటుకు ప్రయత్నించి నవారు. నిజానికి ఈ ప్రక్రియ రాజీవ్‌గాంధీ ఆశీస్సులతో జనరల్ జియా ఉల్ హక్ చొరవతోనే ఆరంభమైంది. మొదటి సమావేశంలో రాజీవ్‌గాంధీ జోర్డాన్ యువ రాజు హసన్ పలుకుబడిని ఆశించారని కూడా వర్మ రాశారు.
యువరాజు రాజీవ్ వ్యక్తిగత మిత్రుడు (ఆ కాలంలో రాయల్ జోర్డాన్ ఎయిర్ లైన్స్‌ను దేశంలోకి అనుమతిస్తూ హక్కు కల్పించారనీ, అందుకు యువ రాజు రాజీవ్‌కు ఒక ఫ్యాన్సీ కారు బహూకరిస్తున్నా రనీ వివాదం చెలరేగింది). హసన్‌కు పాకిస్తాన్‌లో కూడా చాలా పలుకుబడి ఉంది (ఆయన భార్య పాక్ సంతతికి చెందినవారు). అయితే ఇదంతా జనరల్ జియా హత్యకు గురి కావడంతో నిలిచిపోయింది. ఈ శాంతి ప్రక్రియ పట్ల వ్యతిరేకంగా ఉన్న కొందరు జియా సైనిక సహచరులే ఆ హత్యకు పాల్పడ్డారని వర్మ అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలన్నీ కలసి ఒక కుట్ర సిద్ధాం తాన్ని మన ముందు ఉంచుతాయి. నిస్సందేహంగా వర్మ అత్యంత జాగరూకత కలిగిన అధికారి. దాదాపు మూడు దశాబ్దాలు వేచి ఉండి అప్పుడు బహిర్గతం చేశారు. గుల్ వెల్లడించిన వివరాలే వర్మను ఆ రహ స్యాలను బయటపెట్టడానికి ప్రేరణ కలిగించి ఉండ వచ్చు. వర్మ తన జ్ఞాపకాల విషయంలో నిజాయితీగా ఉంటూవచ్చారని నేను నమ్ముతున్నాను. వరుసగా జరిగిన అలాంటి ట్రాక్–2 సమావేశాలకు నేను హాజ రయ్యాను. వీటిలో బలూసా గ్రూప్ పేరిట జరిగిన సమావేశానికి అమ్మాన్‌లో రాజు హసన్ ఆతిథ్యమి చ్చారు. ఈ భేటీలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కె.కౌల్, ఆయన సోదరుడూ, కేబినెట్ మాజీ సెక్రటరీ, అమెరికాలో భారత రాయబారి పి.కె. కౌల్ పాల్గొనేవారు. లెఫ్టినెంట్ జనరల్ సతీష్ నంబియార్, పాకిస్తాన్ మాజీ ఆర్మీ వైస్–చీఫ్ జనరల్ కె.ఎమ్. అరిఫ్, పాక్ ప్రముఖ పారిశ్రామికవేత్త బాబర్ ఆలీ ఈ సమావేశాల్లో సందర్భానుసారం పాల్గొనేవారు.
ఈ బృంద సభ్యుల్లో అత్యంత నిజాయితీపరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ మహ్మద్ దురానీ. అత్యంత వివేచన, ఆశావాది, సైనికతత్వం కలిగిన ఇలాంటి పాకిస్తానీ జనరల్‌ని మీరు ఎన్నడూ చూసి ఉండరు. పాకిస్తాన్ మీడియాలోని కమాండో–కామిక్ తరహా వ్యాఖ్యాతలు ఈయనను ‘జనరల్ శాంతి’ అని అభివర్ణించేవారంటే ఆశ్చర్యం కలిగించదు. తర్వాత 2008లో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతల్లో ఉన్నప్పుడు, కసబ్ పాకిస్తానీ జాతీయుడే అని అంగీకరించడంలో ఎంతో సాహసాన్ని, నిజాయి తీని ప్రదర్శించారు. ఈ నిజాన్ని వ్యతిరేకించలేమని కూడా చెప్పారు. దానికి ప్రతిఫలం ఆయన పదవి ఊడిపోయింది.
మహ్మద్ దురానీ నిజంగానే పాకిస్తాన్ దేశ భక్తుడు, దృఢసైనికుడు అనడంలో సందేహమే లేదు. సియాల్ కోట్ సెక్టర్‌లో ప్రత్యేకించి ఫిలోరా, చావిందా సమరాల్లో ఫస్ట్ ఆర్మర్డ్ డివిజన్ నేతృ త్వంలో భారత మెరుపు దాడుల దళాలు భీకర పోరు సల్పుతున్నప్పుడు, దురానీ పాక్ తరపున యువ ట్యాంక్ కమాండర్‌గా పోరాడారు.
ఆనాటి పోరాటాన్ని బుద్ధిహీనమైన తీవ్రపోరా టంగా ఆయన అభివర్ణించారు. భారత్ పక్షాన నిజంగా అద్భుతమైన, ఎత్తుగడల పరమైన సైనిక చర్య జరిగిందంటే దానికి లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపోర్ కారణమని చెప్పారు. తన సైనిక రెజిమెంట్‌ను తారాపోర్ అత్యంత దూకుడుగా ముందుకు నడిపించారని, కానీ ఆర్టిల్లరీ కాల్పుల్లో తాను మరణించాడని దురానీ చెప్పారు. ఆ యుద్ధంలో ప్రకటించిన రెండు పరమ వీర చక్ర అవార్డులలో ఒకటి తారాపోర్‌కే దక్కింది. నేలకొరి గిన తారాపోర్ మృతదేహాన్ని దురానీ యుద్ధ క్షేత్రంలో స్వయంగా చూశారు. ప్రత్యర్థికి చెందిన వాడైనా ఆ సాహస సైనికుడి పట్ల దురానీ నేటికీ అత్యంత గౌరవం ప్రదర్శిస్తారు.
1987–88లో భారత్ దాదాపు రెండుసార్లు విజ యానికి అతిచేరువలోకి వచ్చి వెనుకడుగు వేసిందని రక్షణ రంగ పరిశీలకులు తరచుగా చెబుతుంటారు. మొదటిది 1987లో బ్రాస్‌ట్రాక్స్‌లో జరిగిన యుద్దం కాగా, రెండోది 1988లో జరిగిన శాంతి ప్రక్రియ. బహిరంగంగా ఇరుపక్షాలూ అధికారికంగా ప్రకటించ కున్నా, నిర్ధారించకపోయినా, సియాచిన్ ఒప్పందం దాదాపు ఖరారైందని అందరికీ అవగతమైంది. అది కూడా తెర వెనుక ఇలాంటి ప్రయత్నాలు, ఉద్రిక్తతల మధ్య కుదిరిన ఒప్పందాల వల్లే ఇది సాద్యమైంది. వీటివల్లే యుద్ధం నుంచి శాంతివైపుగా జరిగిన నాట కీయ పరిణామాలు, మళ్లీ యథాతథస్థితి నెలకొ న్నాయి.
భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించు కుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్‌కి అధిక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్‌ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్‌ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు.
తాజా కలం : లండన్ కేంద్రంగా పనిచేసి ఇంట ర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజిక్ స్టడీస్ అధ్వ ర్యంలో మాల్దీవుల్లోని కురుంబా గ్రామ రిసార్ట్‌లో జరిగిన ట్రాక్–2 రకం భారత–పాక్ సదస్సులో నేను మొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ అసద్ దురానీని కలిశాను. అది 1988 శీతాకాలం. అటల్ బిహారీ వాజ్ పేయీ, నవాజ్ షరీఫ్ పాలనలో భారత్–పాక్ సంబంధాల్లో కాస్త ప్రశాంతత నెలకొన్న సమయ మది. ఆ సమయంలో భారత్ వైపు నుంచి వాగాడం బరం నాటకీయంగా ఎందుకు తగ్గుముఖం పట్టిం దని దురానీ ఆశ్చర్యం వ్యక్తపర్చారు. కశ్మీర్‌లో పూర్తిగా సాధారణ స్థితి, శాంతి నెలకోవడమే దీనికి కారణమని నేను చెప్పాను. ఆ సమయంలో నేను జన రల్ దురానీ నుదురు ముడత పడటాన్ని, తీవ్ర దృక్కులను చూశాను. అప్పుడు దురానీ ఇలా చెప్పారు. ‘ఆ పరిస్థితి మారిపోవడానికి ఎంతోకాలం పట్టదు.‘ పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో మొదటిసారి చొరబాటు జరపడం ద్వారా ఇది నిజమైంది కూడా. ఆరు నెలల తర్వాత లేక ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 19 ఏళ్ల క్రితం ఇరుదేశాల సైన్యాలు అక్కడ యుద్ధం చేశాయి. ఆ తర్వాత ఐదేళ్లకు దురానీ రిటైరయ్యారు. అయినా సరే ఐఎస్‌ఐ బాస్‌గా ఆయనకు అన్ని వివ రాలూ తెలిసి ఉంటాయి.
శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment