రాజీవ్ జైన్, అనిల్ ధస్మనా
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ రాజీవ్ జైన్, రీసెర్చ్ అండ్ అనాలిసిన్ వింగ్(రా) కార్యదర్శి అనిల్ ధస్మనాల పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు వారు పదవిలో ఉంటారు. ఎన్నికల ముంగిట వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పదవుల్లో మార్పులు చేయడం ఇష్టంలేకే ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధస్మనా డిసెంబర్ 29న, జైన్ డిసెంబర్ 30న విరమణ చేయాల్సి ఉంది.
1985 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అనిల్ శ్రీవాస్తవకు నీతి ఆయోగ్ సలహాదారు నుంచి ప్రధాన సలహాదారుగా పదోన్నతి కల్పించారు. 1988 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐపీఎస్ అధికారి రాంపాల్ పవార్‌ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) డైరెక్టర్‌గా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment