కవ్వింత: ఏం చెప్పాడు!
పనివాడు: సార్... మన థియేట ర్లో ఆడుతోన్న సినిమా చూడ్డానికి ఎవరూ రావడం లేదు. ఒక్క టిక్కెట్టు కూడా అమ్ముడవ్వలేదు.
యజమాని: దానికంత కంగారెందుకు? టిక్కెట్లు ఫ్రీగా పంచిపెట్టు. అందరూ వచ్చాక తలుపులు తాళం వేసెయ్. బయటకు వెళ్లాలంటే రెండొందలు కట్టాలని చెప్పు. పనివాడు: ఆ...!
అంతే తెలుసు!
తల్లి: స్వీటీ... ఇంగ్లిష్ ఎగ్జామ్ ఎలా రాశావ్?
స్వీటీ: బాగా రాశాను మమ్మీ. మీ డాడీ ఏం చేస్తారు అని అడిగితే స్వీపర్ అని రాశాను.
తల్లి: అదేంటి... మీ డాడీ అసిస్టెంట్ కమిషనర్ కదా?
స్వీటీ: అవుననుకో. కానీ నాకు అసిస్టెంట్ కమిషనర్ స్పెల్లింగ్ రాదు. అందుకని...!
అలా జరిగిందా?
సుబ్బు: కడుపునొప్పని డాక్టర్ దగ్గరికెళ్లావ్‌గా, ఏమయ్యింది?
పండు: ఆ డాక్టర్ ఇంతకుముందు హోటల్ నడిపాడేమోనని అనుమానంగా ఉందిరా?
సుబ్బు: అదేంటి?
పండు: ఇంజెక్షన్ చేసి డబ్బులడిగాడు. లేవు అంటే... హాస్పిటల్‌లో ఉన్న టవళ్లు, దుప్పట్లు ఉతికించాడు.
అదెలా సాధ్యం?!
భర్త: రాత్రి కలలో దేవుడు కనిపించాడు.
భార్య: అవునా... ఏం కోరుకున్నారు?
భర్త: నీ బుద్ధిని పదిరెట్లు చేయమని అడిగాను.
భార్య: పెంచాడా?
భర్త: సున్నాలకి మల్టిప్లికేషన్ ఉండదు అని మాయమైపోయాడు.