ఏమండీ మనం ఈ వారం సినిమాకెళ్దాం.
వచ్చేవారం షాపింగ్‌కి వెళ్దాం.
ఆ వచ్చేవారం వారం టూర్‌కి వెళ్దాం.
భర్త: నాలుగో వారం గుడికెళ్దామా?
భార్య: ఎందుకు?
భర్త: బిచ్చమెత్తుకోవాలిగా.
అమాయకుడు నెం.1
సురేష్: ఇంపాజిబుల్ అనే పదం నా డిక్షనరీలో లేదు.
నరేష్: ఇపుడు బాధపడి ఏం లాభం, కొనుక్కునేటపుడు చూసుకోవాలి కదా!
తొక్కలో తెలివి
కస్టమర్: అరటి పండు ఎంత?
సెల్లర్: ఐదు రూపాయలు.
కస్టమర్: రెండ్రూపాయలకు ఇవ్వు
సెల్లర్: తొక్క వస్తుంది కావాలా?
కస్టమర్: ఓకే, మూడురూపాయలు ఇస్తా. తొక్క ఉంచుకుని, పండు ఇచ్చేయ్.
నాది పూర్తి కల
భార్య: మీరు డైమండ్ నెక్లెస్ కొంటున్నట్లు నాకు కల వచ్చింది.
భర్త: అయ్యో నీకు అంతవరకే వచ్చిందా. నాకు మీ నాన్న బిల్లు కట్టినంత వరకు వచ్చింది.
అదే ప్రిస్క్రిప్షన్
రంగారావు మందుల షాపుకి వెళ్లి పాయిజన్ ఇవ్వమని అడిగాడు.
కెమిస్ట్: ప్రిస్క్రిప్షన్ లేకుండా పాయిజన్ అమ్మం.
రంగారావు: ఇదిగో.
కెమిస్ట్: ఏమిటిది?
రంగారావు: నా మ్యారేజ్ సర్టిఫికెట్ !!
లేటెస్ట్ బెగ్గర్
మొదటి బెగ్గర్: ఎందుకు ఆ సినిమా పోస్టరును తదేకంగా చూస్తున్నావు
రెండో బెగ్గర్: అది నేను తీసిన సినిమా పోస్టర్‌లే, పదా!
కవ్వింత: భార్య లిస్టు
Published Sun, Apr 20 2014 3:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement