నామీద జోకులు భలే ఉన్నాయే: ఆలియాభట్ | Alia Bhatt finds jokes about her GK funny | Sakshi
Sakshi News home page

నామీద జోకులు భలే ఉన్నాయే: ఆలియాభట్

Published Wed, Jul 9 2014 3:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నామీద జోకులు భలే ఉన్నాయే: ఆలియాభట్ - Sakshi

నామీద జోకులు భలే ఉన్నాయే: ఆలియాభట్

హైవే, 2 స్టేట్స్ లాంటి సినిమాలతో ఒక్కసారిగా తారాపథానికి దూసుకెళ్లిన ఆలియా భట్ జనరల్ నాలెడ్జి గురించి ఇంటర్నెట్లో బోలెడన్ని జోకులుంటాయి. భారత ప్రధానమంత్రి ఎవరంటే.. పృథ్వీరాజ్ చవాన్ అని ఆమె ఓసారి చెప్పింది. ఇక అప్పటినుంచి ఆలియా విజ్ఞాన స్థాయి గురించి జోకులు తెగ పేలుతున్నాయి. ఇంటర్నెట్లో ఆలియా భట్ జోక్స్ అని కొడితే చాలు.. విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అడిగితే.. ఆమ్ ఆద్మీ పార్టీ అని, ఎందుకంటే ఇది 'ఆమ్' (మామిడిపండ్ల) సీజన్ కాబట్టి ఆ పార్టీ గెలుస్తుందని చెప్పిందట!!

అయితే, వీటన్నింటినీ ఆమె కూడా ఎంజాయ్ చేస్తోంది. వాటిని చూసి తాను ఏమీ బాధపడటంలేదని, అవన్నీ చాలా సరదాగా ఉన్నాయని.. జోకులను ఎప్పుడూ సరదాగానే తీసుకోవాలని ఆలియా చెప్పింది. ఈ పేరుతోనైనా తాను చాలామంది ఆలోచనల్లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని అంటోంది. వరుణ్ ధవన్తో కలిసి ఆలియా భట్ నటించిన హంప్టీ శర్మా కీ దుల్హనియా చిత్రం విడుదల కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement