హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ | Shabana Azmi lauds Alia Bhatt work in 'Highway' | Sakshi
Sakshi News home page

హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ

Published Thu, Feb 27 2014 11:58 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ - Sakshi

హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ

స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన 'హైవే' చిత్రంలో మహేష్ భట్ కూతురుఆలియా భట్ నటన చాలా బాగుందని అలనాటి నటి షబానా అజ్మీ ప్రశంసలు కురిపించారు. ఆమె నేరుగా భట్ ఇంటికి వెళ్లి ఆలియాకు, ఆమె తల్లిదండ్రులకు స్వయంగా అభినందనలు తెలిపారు. 20 ఏళ్ల వయసులోనే ఆలియా అద్భుతంగా నటించిందని చెప్పారు. పలుమార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న షబానా అజ్మీ.. ఆలియా సహజనటి అని, ఏ రకంగా చూసినా అద్భుతంగా చేసిందని తెలిపారు. తన భర్త జావేద్ అక్తర్తో కలిసి నేరుగా ఆలియా ఇంటికి వెళ్లినట్లు ఆమె చెప్పారు. తామిద్దరికీ ఆమె నటన చాలా నచ్చిందని, ఆలియాను చూసి చాలా గర్వంగా ఉందని అన్నారు.

అయితే.. ఆలియా తండ్రి మహేష్ భట్ మాత్రం హైవే సినిమాను 1982లో షబానా నటించిన 'అర్థ్' సినిమాతో పోల్చారు. ఆ సినిమాకు గాను ఆలియా భట్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. మహేష్ ఏదో ఆషామాషీగా ఆ మాట అనలేదని, అలాగే ఆలియా తన కూతురు కాబట్టి కూడా చెప్పలేదని, నిజంగానే ఆమె పనితీరు అందులో అంత అద్భుతంగా ఉందని అన్నారు. ఆలియాను ఎంతో ముద్దుగా చూసుకునే ఆమె అక్క పూజాభట్ కూడా ఈ సినిమాను ప్రశంసించింది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంలో ఆమె యువనటిగా వస్తే, హైవేతో పూర్తి స్థాయి నటిగా నిరూపించుకుందని, ఆమెను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ఇంతియాజ్ అలీకి ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటానంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement