Imtiaz Ali
-
ఆలియా భట్ కోసం ఇరవై ఏళ్ల ముందే..!
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే దర్శకుడు ఇంతియాజ్ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్ ఏర్పడాలనుకుంటాడు. అందుకే సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందు టీమ్‌ను ఏదైనా ట్రిప్‌కి పంపిస్తాడట. తన సినిమాకు కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్ రాసిపెట్టుకుంటాడు. ‘హైవే’ కోసమైతే ఆలియా భట్‌ను (29) తాను ఫస్ట్‌టైమ్ చూసిన వెంటనే (అప్పుడు ఆమెకు తొమ్మిదేళ్లు) స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడుట. నటీనటుల లైఫ్ ఎక్స్పీరియెన్సెస్నూ కథలో భాగంగా చూపించే ప్రతయ్నం చేస్తాడు. ఆయన ‘తమాషా’లో కథానాయకుడు.. అతని తండ్రికి మధ్య చూపించిన అనుబంధం.. ఆ సినిమా హీరో రణ్‌బీర్ కపూర్, అతని తండ్రి రిషి కపూర్‌కు మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా చిత్రీకరించిందేనట. -
నివర్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన నివర్ తుఫాను రేపు మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ చెన్నై ఆగ్నేయం దిశగా 420 కిమీ వేగంతో పుదుచ్చెరి చుట్టూ కారైకల్, మామల్లపురం, తమిళనాడు తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 24 గంటల్లో నివర్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల రేపు, ఎల్లుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు రక్షణ చర్యల్లో భాగంగా సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఇక రేపు(బుధవారం) మామళ్లపురం- కరైకల్ తీరం వెంబడి 65-85 కిమీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భార వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున్న మత్సకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాక నెల్లూరు జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను సిద్దం చేస్తుండగా.. కాకినాడ, అమలాపురం, పెద్దాపురంలోని 13 మండలాలు అధికారులకు ఏపీ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇక కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్ అలీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చెన్నైలో 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు అయితే నిన్నటి నుంచి చెన్నై, కరైకల్, నాగపట్నంలో కురిసిన వర్షం కారణంగా చెన్నై పోర్టులో 6వ నంబర్ వద్ద తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో 100 కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో కడలూరు పోర్టులో 7వ నంబర్ వద్ద అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో కూడా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
కరోనాపై కృష్ణాజిల్లా కలెక్టర్ పేరడి పాట
సాక్షి, విజయవాడ: కరోనాపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండి వైరస్‌ను నియంత్రించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినిమా పాటకు కలెక్టర్ ఇంతియాజ్ పేరడి పాటను రాయగా ఆ పాటను చంద్రిక పాడారు. ఈ పాటను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 36 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వైరస్‌పై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా నిర్లక్ష్యంగా ఉంటే దాని బారిన పడతారన్నారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. ఈనెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ కోవిడ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చదవండి: ఎమ్మెల్యే వంశీకి పాజిటివ్ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి అని, ఈ పండుగ ప్రజలందరికి విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. -
నీరసించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ కలెక్షన్లు
ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘లవ్ ఆజ్ కల్ 2’. ఈ సినిమా మ్యాజిక్ చేస్తుందనుకుంటే అసలుకే ఎసరు పెట్టింది. సస్స్ర్కీన్ ప్లే వీక్‌గా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కానీ కొంతమంది ప్రేమికులు మాత్రం సారా, కార్తీక్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఈ జంట రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ.12 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రూ.8 కోట్లు రాబట్టింది. ఇక ఆదివారం సుమారు రూ.10 కోట్లు వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ రూ.6 కోట్లతో సరిపెట్టుకుంది.(ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది) ఇప్పటివరకు మొత్తంగా రూ.26 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం థియేటర్లలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాగా ఈ చిత్రం సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే నటించిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాను తెరకెక్కించిన ఇంతియాజ్ అలీ సీక్వెల్‌కు సైతం దర్శకత్వం వహించాడు. అయితే ఈసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. కథలో కొత్తదనం లేదని, పాత చింతకాయ పచ్చడే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ సారా అలీఖాన్ ఓవర్ యాక్షన్ మాత్రం భరించలేకున్నామని మరికొందరు ఘాటుగానే స్పందించారు. తొలిరోజు అదుర్స్ అనిపించిన కలెక్షన్లు తర్వాత డీలా పడిపోయాయి. (‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్!) చదవండి: ‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ రూ. 12 కోట్లు -
‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ అదుర్స్.. కానీ!
బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ సారా అలీ ఖాన్, రణ్‌దీప్ హూడాలు ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫ్రిబ్రవరి 14)న విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు ఇంతీయాజ్ అలీ 2009లోని ‘లవ్ ఆజ్ కల్’కు స్వీకెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. విభిన్న ప్రేమకథ భావాలతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సెన్సార్ బోర్డు కూడా సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. అలా ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 12.40 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ సినిమా అనుకున్న అంచనాలకు చేరుకోలేక పోయింది. అటు అభిమానుల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్! దర్శకుడు ఇంతీయాజ్ కాలానుగుణంగా ప్రేమలో వచ్చే మార్పులను చూపించేందుకు భిన్న ప్రేమ కథలను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా కార్తీక్ ఆర్యన్ 2020 నాటి ప్రేమికుడు వీర్, 1990 నాటి రఘుగా ద్విపాత్రలు పోషించాడు. ఇక వీర్‌కు ప్రియురాలిగా సారా నటించగా.. 1990 నాటి రఘు ప్రేయసిగా లిలా పాత్రలో ఆరూషి నటించిది. ఇక ఆరూషికి ఇదే మొదటి సినిమా కూడా. ఇకపోతే విడుదలైన రోజునే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సారా అలీ ఖాన్ చేసిన ఓవరాక్షన్ భరించలేపోయామంటు సారాపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో కేవలం కార్తీక్ నటన మాత్రమే బాగుందని.. మిగతాదంతా అంతా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్యారాచూట్‌పై ఉన్న ఓ వ్యక్తి భయపడుతూ కళ్లు మూసుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. ‘కావాలంటే 500 ఇస్తాం దయచేసి సినిమా ఆపండ్రా బాబు’ అంటూ క్రియోట్ చేసిన మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
ఏదైనా నేర్చుకోవడమే
గత ఏడాది ‘కేధార్నాథ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఆ తర్వాత రోహిత్‌శెట్టి ‘సింబ’లో హీరోయిన్గా మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం డేవిడ్ ధావన్ (కూలీ నం 1 తాజా రీమేక్), ఇంతియాజ్ అలీ (లవ్ ఆజ్ కల్ సీక్వెల్) వంటి సీనియర్ దర్శకులతో వర్క్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే బాగా అనుభవం ఉన్న దర్శకుల సినిమాల్లో నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా? అన్న ప్రశ్నకు సారా బదులిస్తూ–‘‘అలా ఏం లేదు. డేవిడ్, ఇంతియాజ్సార్లతో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ నా లక్ కూడా. ఇంతియాజ్సర్ షూటింగ్ ఉందంటే రెండు వారాల ముందే రిహార్సల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక డేవిడ్సర్ సినిమా అంతా సెట్లో అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఉంటుంది. ఈ రెండు అనుభూతులు నాకు వినోదాత్మకంగానే ఉన్నాయి. ప్రస్తుతం కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. ఏదైనా నేర్చుకోవడమే అనుకుని కష్టపడుతున్నాను. నా పాత్రల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. గ్లామర్, డ్యాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఇష్టమే కానీ నేను చేసే కమర్షియల్ సినిమాల్లో నా పాత్రలో పెర్ఫార్మెన్స్, ఎమోషన్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఉందో లేదో చూసుకుంటాను’’ అన్నారు. -
కొత్త ప్రేమాయణం
ప్రేమించుకునేందుకు ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు హీరో హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్ అండ్ సారా అలీఖాన్. అక్కడి నుంచి పంజాబ్‌కు ప్రయాణిస్తారట. వారి ప్రేమ జ్ఞాపకాలను వెండితెరపై చూడాలంటే చాలా టైమ్ ఉంది. ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘లవ్ ఆజ్ కల్’కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు ఇంతియాజ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తారు. ఢిల్లీ షెడ్యూల్ తర్వాత ఈ టీమ్ పంజాబ్ వెళ్తుందట. ముంబైలో కూడా కొన్ని సీన్స్‌ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ముందుగా ఈ సినిమాలో సారా అలీఖాన్ తండ్రి, ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాలో సైఫ్ నటించడం లేదని, ఆయన్ను ఆనుకున్న పాత్రలో రణ్‌దీప్ హుడా నటించనున్నారని తెలిసింది. ఇంతకుముందు ‘హైవే’ చిత్రం కోసం ఇంతియాజ్ అండ్ రణ్‌దీప్ కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే. తాజా సీక్వెల్‌ను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారట. -
చల్లని రాత్రిలో షారుక్‌కు వెచ్చటి కానుక
ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆయన అభిమానులు వెచ్చటి కానుకను పంపించారు. ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డాంలో షూటింగ్ లో ఉన్న ఆయనకు చలి నుంచి బయటపడేందుకు కొంతమంది బాయ్స్ స్వచ్ఛమైన లెదర్ జాకెట్ ను పంపించారు. ఈ సందర్భంగా అభిమానులు పంపించిన గిఫ్ట్ ను ఫొటో తీసి దానికి.. 'ఆమ్‌స్టర్‌డాంలోని చల్లటి రాత్రిలో షూటింగ్. వెచ్చదనం కోసం అమ్మాయిలు కౌగిలిని పంపించగా అబ్బాయిలు ఓ స్వచ్ఛమైన లెదర్ జాకెట్‌ను గిఫ్ట్ గా కొరియర్ చేశారు' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'ది రింగ్' అనే చిత్రంలో షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా అనుష్క శర్మ నటిస్తోంది. అలీ దర్శకత్వంలో సినిమా చేయడం షారుక్ కు ఇదే తొలిసారి. -
జోరుగా కలెక్షన్ల 'తమాషా'!
ముంబై: బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల 'తమాషా' జోరుగానే కొనసాగుతున్నది. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే జంటగా తీసిన 'తమాషా' చిత్రం దేశంలో తొలిరోజే రూ. 10.87 కోట్లు వసూలు చేసింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ ఇదే. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. 'తమాషా'లో రణ్‌బీర్, దీపికా అభినయానికి మంచి మార్కులే పడుతున్నాయి. దీనికి తోడు ప్రేక్షకుల 'మౌత్ పబ్లిసిటీ' కూడా సినిమాకు బాగా కలిసి వస్తున్నది చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం భారీ సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం 'తమాషా'కు కలిసి వచ్చింది. పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం బరిలో లేకపోవడంతో మొదటి వారాంతంలో భారీగా వసూళ్లు ఉంటాయని చిత్రబృందం ఆశిస్తున్నది. యూటీవీ మోషన్ పిక్చర్స్, నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త సమర్పణలో సాజిద్ నదియావాలా ఈ సినిమాను రూపొందించారు. -
యాక్టింగ్ గ్రేట్... డెరైక్షన్ వీక్... తమాషా
కొత్త సినిమా గురూ! రొమాంటిక్ సినిమాలు తీయడంలో దిట్ట దర్శకుడు ఇమ్తియాజ్ అలీ. మాజీ ప్రేమికులు - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోనే. వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఒక చిత్రమైన ప్రేమకథ. తాజా హిందీ చిత్రం ‘తమాషా’ మీద ఆసక్తి కలగడానికి అంతకన్నా ఇంకేం కావాలి? కానీ, ఇందులో చర్చించిన పాయింట్ అంతకు మించి! చిత్రం - ‘తమాషా’ (హిందీ) తారాగణం - రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే కెమేరా - రవివర్మన్ సంగీతం - ఏ.ఆర్. రహమాన్, ఎడిటింగ్ - ఆర్తీ బజాజ్ నిర్మాత - సాజిద్ నడియాడ్వాలా రచన, దర్శకత్వం - ఇమ్తియాజ్ అలీ జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? చిన్నప్పుడు ఇంట్లో తల్లి తండ్రుల నుంచి స్కూల్లో టీచర్ దాకా, పెద్దయ్యాక ఫ్రెండ్స మొదలు ఆఫీస్‌లో బాస్ దాకా ప్రతి ఒక్కరూ కండిషనింగ్ చేసేవాళ్ళే. చుక్కలకు ఎగరనివ్వకుండా రెక్కలు కత్తిరించేవాళ్ళే. మరి అప్పుడు జీవితం ఎలా జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? తాత్త్వికంగా అనిపించినా, వాస్తవికంగా అందరూ ఎదుర్కొనే సమస్య ఇది. ముఖ్యంగా, మనసుకు సంకెళ్ళు లేకుండా, ఊహాప్రపంచంలోకి విహరిస్తూ, నచ్చింది చేస్తూ నచ్చినట్లు బతకాలని తపించేవాళ్ళకు అది మరీ పెద్ద సమస్య. మరి, అలాంటి ఒక అబ్బాయి వేద్ (రణబీర్‌కపూర్)కీ, ఒక అమ్మాయి తార (దీపిక)కీ మధ్య ఒకరి గురించి మరొకరికి తెలియనప్పుడు ప్రేమ పుడితే? పేర్లయినా తెలియకుండానే విడిపోయిన వారిద్దరూ నాలుగేళ్ళ తరువాత మళ్ళీ ఎదురైతే? ఇలాంటి ఒక చిత్రమైన నేపథ్యాన్ని, ఎంచుకున్న సమస్యకు జోడించి, దర్శకుడు ఇమ్తియాజ్ అలీ అందించిన న్యూ ఏజ్ లవ్‌స్టోరీ - ‘తమాషా’. నవతరం మనస్తత్తాన్నీ, చిత్రమైన ప్రేమకథల్నీ రంగరించి విచిత్రంగా చెప్పడంలో పేరున్న ఇమ్తియాజ్ అలీ ఈసారీ ఆ శైలినే అనుసరించారు. సాదాసీదాగా సినిమాలన్నీ నడిచే లీనియర్ పద్ధతిలో కాక, నాన్-లీనియర్ కథనాన్ని ఎంచుకున్నారు. అందుకు తగ్గట్లే ఆయన తీసుకున్న హీరో, హీరోయిన్ పాత్రల్లో బోలెడంత మానసిక సంఘర్షణ, వదులుకోలేని భయాలు, వదిలించుకోలేని గతం - వర్తమానాలు ఉంటాయి. ఆ పాత్రలకు తెరపై బొమ్మ కట్టడంలో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేలు నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తండ్రితో పాటు సొసైటీ చేసిన కండిషనింగ్‌తో మనసును చంపుకొని, యాంత్రికంగా ఉద్యోగం చేసే వేద్ పాత్రలో రణ్‌బీర్ నటన బాగుంది. అలాగే, అతనెవరో తెలీని పరిస్థితుల్లో అతనిలోని ఆ కోణాన్నే ఇష్టపడి, ప్రేమించి, ఆనక ఆ లక్షణం కనబడనప్పుడు దూరం జరిగే లవర్‌గా దీపిక యాక్షన్ సూపర్. ఈ నిజజీవిత మాజీ లవర్స మధ్య కెమిస్ట్రీ వెండితెరను వెలిగించింది. గతంలో ‘జబ్ ఉయ్ మెట్’, ‘లవ్ ఆజ్ కల్’తో అభినందనలు అందు కున్న ఇమ్తియాజ్ అలీ ఈ సారి అనుకున్న కథను వెండితెరపై కన్విన్సింగ్‌గా చూపించడంలో తడబడ్డారనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో చిన్న పిల్లాడి ఎపిసోడ్ దగ్గరే చాలాసేపు గడవడంతో, ఇంటర్వెల్ ముందు కానీ కాస్తంత కథ జరిగినట్లు అనిపించదు. అసలు కథ నడిచేదంతా సెకండాఫ్‌లో. కాకపోతే, సెకండాఫ్‌లో ఒక దశ దాటిన తరువాత హీరో పాత్ర ప్రవర్తన అతని మానసిక స్వస్థతను అనుమానించేలా చేస్తుంది. ఒక దశలో హీరో పెళ్ళి ప్రతిపాదనను హీరోయిన్ కాదనడానికి కానీ, ఆ తరువాత అతణ్ణి మక్కువతో అక్కున చేర్చుకోవడానికి కానీ సరైన భూమికను సినిమాలో చూపెట్టలేకపోయారు. ఈ లోపాలు నీరుగార్చినా, సినిమాలో కాస్తయినా గుర్తుండేవి హీరో, హీరోయిన్ల అభినయమే. రవివర్మన్ కెమేరా వర్కలో సిమ్లా మొదలు ఫ్రాన్స మీదుగా కలకత్తా, ఢిల్లీ దాకా అన్నీ కనువిందు చేస్తాయి. ఏ.ఆర్. రహమాన్ సంగీతంలో పంజాబీ సాంగ్ లాంటి కొన్ని ఊపు తెప్పిస్తాయి. హిందీ సినిమాల నిర్మాణ విలువల సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. అన్నీ ఉన్నా... అదేదో అన్నట్లు... డెరైక్షన్ వీక్ అవడంతో ఆశించిన తృప్తి కలగకపోతే, ఎవరిని తప్పు పడతాం. - రెంటాల -
హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ
స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన 'హైవే' చిత్రంలో మహేష్ భట్ కూతురుఆలియా భట్ నటన చాలా బాగుందని అలనాటి నటి షబానా అజ్మీ ప్రశంసలు కురిపించారు. ఆమె నేరుగా భట్ ఇంటికి వెళ్లి ఆలియాకు, ఆమె తల్లిదండ్రులకు స్వయంగా అభినందనలు తెలిపారు. 20 ఏళ్ల వయసులోనే ఆలియా అద్భుతంగా నటించిందని చెప్పారు. పలుమార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న షబానా అజ్మీ.. ఆలియా సహజనటి అని, ఏ రకంగా చూసినా అద్భుతంగా చేసిందని తెలిపారు. తన భర్త జావేద్ అక్తర్‌తో కలిసి నేరుగా ఆలియా ఇంటికి వెళ్లినట్లు ఆమె చెప్పారు. తామిద్దరికీ ఆమె నటన చాలా నచ్చిందని, ఆలియాను చూసి చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే.. ఆలియా తండ్రి మహేష్ భట్ మాత్రం హైవే సినిమాను 1982లో షబానా నటించిన 'అర్థ్' సినిమాతో పోల్చారు. ఆ సినిమాకు గాను ఆలియా భట్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. మహేష్ ఏదో ఆషామాషీగా ఆ మాట అనలేదని, అలాగే ఆలియా తన కూతురు కాబట్టి కూడా చెప్పలేదని, నిజంగానే ఆమె పనితీరు అందులో అంత అద్భుతంగా ఉందని అన్నారు. ఆలియాను ఎంతో ముద్దుగా చూసుకునే ఆమె అక్క పూజాభట్ కూడా ఈ సినిమాను ప్రశంసించింది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంలో ఆమె యువనటిగా వస్తే, హైవేతో పూర్తి స్థాయి నటిగా నిరూపించుకుందని, ఆమెను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ఇంతియాజ్ అలీకి ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటానంది. -
ఏఆర్ రెహ్మాన్ ఓపిగ్గా పాడించారు: ఆలియా
ఓ లక్ష్యంతో సినీ పరిశ్రమలో స్థిరపడుదామని వచ్చిన వాళ్లు మరోరకంగా సెటిల్ అవడం మనం చూస్తునే ఉంటాం. హీరో అవుదామని వచ్చి..దర్శకులుగా మారడం.. సింగ్లర్లు హీరోలుగా మారడం లాంటి సంఘటనలు గతంలో సాక్ష్యంగా నిలిచాయి. అయితే హైవే చిత్ర షూటింగ్ లో ఏదో సరదాకు 'జియా రే జియా' అంటూ మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ పాటను పాడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, మహేశ్ భట్ కూతురు ఆలియా భట్ ను చూసి ఆమెను సింగర్ గా మార్చారు దర్శకులు ఇంతియాజ్ ఆలీ. దర్శకుడు వచ్చి నన్ను పాట పాడమని అడిగినపుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. పాడటం నాకు తెలియదు. రికార్డింగ్ సమయంలో చాలా తప్పులు చేశాను. అయినా నా నుంచి సరియైన అవుట్ పుట్ వచ్చేలా రెహ్మన్ సార్.. చాలా ఓపికగా నా చేత పాట పాడించారు అని ఆలియా తెలిపింది. అంతేకాకుండా రెండేళ్లపాటు పాడటం ప్రాక్టీస్ చేస్తే.. నాతో ఓ ఆల్బమ్ రూపొందిస్తానని రెహ్మన్ మాట ఇచ్చారని ఆలియా వెల్లడించింది. ఒకవేళ తాను నటిగా రాణించకపోతే..భవిష్యత్ లో సింగర్ గా సెటిల్ అవుతాను. నటిస్తూ, సింగర్ గా రాణించడం చాలా కష్టమని ఆలియా తెలిపింది. కరణ్ జోహర్ రూపొందించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన ఆలియాభట్ తన రెండవ చిత్రంలో రణదీప్ హుడాతో కలిసి 'హైవే'లో నటిస్తోంది.