ఏఆర్ రెహ్మాన్ ఓపిగ్గా పాడించారు: ఆలియా
ఏఆర్ రెహ్మాన్ ఓపిగ్గా పాడించారు: ఆలియా
Published Sun, Jan 19 2014 9:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
ఓ లక్ష్యంతో సినీ పరిశ్రమలో స్థిరపడుదామని వచ్చిన వాళ్లు మరోరకంగా సెటిల్ అవడం మనం చూస్తునే ఉంటాం. హీరో అవుదామని వచ్చి..దర్శకులుగా మారడం.. సింగ్లర్లు హీరోలుగా మారడం లాంటి సంఘటనలు గతంలో సాక్ష్యంగా నిలిచాయి. అయితే హైవే చిత్ర షూటింగ్ లో ఏదో సరదాకు 'జియా రే జియా' అంటూ మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ పాటను పాడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, మహేశ్ భట్ కూతురు ఆలియా భట్ ను చూసి ఆమెను సింగర్ గా మార్చారు దర్శకులు ఇంతియాజ్ ఆలీ.
దర్శకుడు వచ్చి నన్ను పాట పాడమని అడిగినపుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. పాడటం నాకు తెలియదు. రికార్డింగ్ సమయంలో చాలా తప్పులు చేశాను. అయినా నా నుంచి సరియైన అవుట్ పుట్ వచ్చేలా రెహ్మన్ సార్.. చాలా ఓపికగా నా చేత పాట పాడించారు అని ఆలియా తెలిపింది. అంతేకాకుండా రెండేళ్లపాటు పాడటం ప్రాక్టీస్ చేస్తే.. నాతో ఓ ఆల్బమ్ రూపొందిస్తానని రెహ్మన్ మాట ఇచ్చారని ఆలియా వెల్లడించింది.
ఒకవేళ తాను నటిగా రాణించకపోతే..భవిష్యత్ లో సింగర్ గా సెటిల్ అవుతాను. నటిస్తూ, సింగర్ గా రాణించడం చాలా కష్టమని ఆలియా తెలిపింది. కరణ్ జోహర్ రూపొందించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన ఆలియాభట్ తన రెండవ చిత్రంలో రణదీప్ హుడాతో కలిసి 'హైవే'లో నటిస్తోంది.
Advertisement
Advertisement