సారా అలీఖాన్
గత ఏడాది ‘కేధార్‌నాథ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఆ తర్వాత రోహిత్‌శెట్టి ‘సింబ’లో హీరోయిన్‌గా మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం డేవిడ్ ధావన్ (కూలీ నం 1 తాజా రీమేక్), ఇంతియాజ్ అలీ (లవ్ ఆజ్ కల్ సీక్వెల్) వంటి సీనియర్ దర్శకులతో వర్క్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే బాగా అనుభవం ఉన్న దర్శకుల సినిమాల్లో నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా? అన్న ప్రశ్నకు సారా బదులిస్తూ–‘‘అలా ఏం లేదు.
డేవిడ్, ఇంతియాజ్‌సార్లతో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నా లక్ కూడా. ఇంతియాజ్‌సర్ షూటింగ్ ఉందంటే రెండు వారాల ముందే రిహార్సల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక డేవిడ్‌సర్ సినిమా అంతా సెట్‌లో అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఉంటుంది. ఈ రెండు అనుభూతులు నాకు వినోదాత్మకంగానే ఉన్నాయి. ప్రస్తుతం కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. ఏదైనా నేర్చుకోవడమే అనుకుని కష్టపడుతున్నాను. నా పాత్రల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను. గ్లామర్, డ్యాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఇష్టమే కానీ నేను చేసే కమర్షియల్ సినిమాల్లో నా పాత్రలో పెర్ఫార్మెన్స్, ఎమోషన్ ఎలిమెంట్స్‌కు స్కోప్ ఉందో లేదో చూసుకుంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment